అటునుండి ఇటు… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి

లే! లే, మిత్రమా! పుస్తకాల్ని పక్కన పడెయ్.
లేకపోతే నువ్వు రెండురెట్లు లావు అవుతావు.
లే! లే, మిత్రమా! లేచి కళ్ళు తుడుచుకో!
ఎందుకొచ్చిన శ్రమ ఇదంతా నీకు ?

చూడు, సూర్యుడు పడపటికొండ శిఖరాన
ఎంత లావణ్యంతో మెరుస్తున్నాడో
విశాలమైన ఈ పచ్చిక చేలమీద మనోహరంగా
తన బంగారువన్నె నీరెండ పరుస్తున్నాడు.

ఆహ్, పుస్తకాలు! స్వారస్యంలేని ఆ గోల ఎప్పుడూ ఉండేదేలే, 
రా, చిట్టడవిలోని ఆ పిట్టపాట విను.
ఎంత మధురంగా ఉంది ఆ పాట! నా మీద ఒట్టు,
అందులో ఇంతకంటే ఎక్కువ వికాసము ఉంది.

అదిగో విను! కోకిల ఎంత తియ్యగా పాడుతోందో!
అదేమీ తక్కువ తినలేదు ఉపదేశించగలగడంలో;
ఆరుబయట వెలుగులోకి ఒకసారి అడుగుపెట్టు  
ప్రకృతిని నీ గురువుగా స్వీకరించు.

మన మనసుల్నీ, మేధనీ అనుగ్రహించడానికి వీలుగా
ఆమెదగ్గర సిద్ధంగా ఎప్పుడూ అంతులేని సిరులుంటాయి,
ఆరోగ్యంతో పాటు అవలీలగా అబ్బుతుంది తెలివి
ఆనందం మనలో రగిలిస్తుంది సత్య స్ఫూర్తి.

వసంత ఋతువులోని ఏ తోట ఇచ్చే ప్రేరణైనా చాలు
మనిషిగురించి ఎంతో ఎక్కువ తెలుసుకుందికి,
మంచీ, చెడూ, విలువలగురించి తెలుస్తుంది
ఏ ఋషులు చెప్పగలిగినదానికంటే ఎక్కువగా. 

ప్రకృతి చెప్పే కథలు రమ్యంగా ఉంటాయి;
మనం తొందరపాటుతో తెలివనుకుని చేసే జోక్యంతో
వస్తువుల అందాన్ని చెడగొడతాము—
పరీక్షల పేరుతో హత్యగావిస్తుంటాము.

చాలు ఇక ఈ విజ్ఞానమూ, కళాతృష్ణా
ఆ నిష్ఫలమైన పేజీలు ఇక మూసెయ్యి,
బయటకి రా, చూడగలిగి, అందుకోగలిగిన
ఒక్క హృదయాన్ని మాత్రమే వెంట తీసుకురా.

.

విలియం వర్డ్స్ వర్త్
7 ఏప్రిల్ 1770 – 23 ఏప్రిల్ 1850
ఇంగ్లీషు కవి

 

.

The Tables Turned

UP! up, my friend! and quit your books,

  Or surely you ’ll grow double;

Up! up, my friend! and clear your looks!

  Why all this toil and trouble?

The sun, above the mountain’s head,

  A freshening lustre mellow

Through all the long green fields has spread,

  His first sweet evening yellow.

Books! ’t is a dull and endless strife;

  Come, hear the woodland linnet—

How sweet his music! on my life,

  There ’s more of wisdom in it!

And hark! how blithe the throstle sings!

  He, too, is no mean preacher;

Come forth into the light of things—

  Let Nature be your teacher.

She has a world of ready wealth,

  Our minds and hearts to bless,—

Spontaneous wisdom breathed by health,

  Truth breathed by cheerfulness.

One impulse from a vernal wood

  May teach you more of man,

Of moral evil and of good,

  Than all the sages can.

Sweet is the lore which nature brings;

  Our meddling intellect

Misshapes the beauteous forms of things—

  We murder to dissect.

Enough of science and of art;

  Close up those barren leaves;

Come forth, and bring with you a heart

  That watches and receives.

.

William Wordsworth (1770–1850)

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al.

Volume V. Nature.  1904.

  1. Nature’s Influence

http://www.bartleby.com/360/5/15.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: