రోజు: ఫిబ్రవరి 28, 2016
-
విశ్వాసము… జార్జి శాంతాయన, స్పానిష్- అమెరికన్ కవి
ఈ మధ్యకాలంలో నేను చదివిన అపురూపమైన కవితల్లో ఇదొకటి. ఓ ప్రపంచమా! నువ్వు ఉత్తమంగా ఉండాలని ఎందుకనుకోవు? తెలివి అంటే, కేవలం జ్ఞానాన్ని సంపాదించి, అంతర్దృష్టితో దేన్నీ చూడకుండా కళ్ళుమూసుకోవడం కాదు, తెలివంటే, మనసుమీద పూర్తి విశ్వాసం కలిగి ఉండడం. కొలంబస్ ఒక ప్రపంచాన్నే కనుక్కోగలిగేడు, నక్షత్రాలస్థితిని చూసి అర్థంచేసుకోగల నమ్మకం తప్ప; మార్గదర్శనానికి అతని దగ్గర ఏ సముద్రపటాలూ లేవు, మనసు విశ్లేషించినదానిపై అచంచల విశ్వాసమే అతని శాస్త్రపరిజ్ఞాన పరిధీ, అతని ఏకైక అభినివేశమూ. మన…