ఈ బ్రతుకు… ఫ్రాన్సిస్ బేకన్, ఇంగ్లీషు రచయిత

ఈ సృష్టి ఒక బుడగ, మనిషి
జీవితకాలం అందులో ఒక లిప్త:
తల్లి కడుపులోంచి, భూమి కడుపులో దాకా
అన్నీ దౌర్భాగ్యపు ఆలోచనలే;
ఉయ్యాలనాటినుండి శాపగ్రస్తుడై
బాధలతో, భయాలతో జీవీతకాలం ఎదగడమే.
ఇక ఎప్పుడు మృత్యువు వస్తుందా అని ఎదురుచూస్తాడు
నీటిమీద బొమ్మలేస్తూ, బుగ్గిలో రాసుకుంటూ

మనం బాధతో కుంచించుకు పోయి బ్రతుకుతాం గాని
ఏ జీవితం బాగుంది గనక?
రాజసభలు చూడబోతే మూర్ఖుల్ని
బుజ్జగించడానికి పనికొచ్చే పాఠశాలలు;
పల్లెలు చూడబోటే ఆటవికులకు
ఆలవాలాలుగా మారిపోయాయి
ఇక ఏ వ్యసనాలకూ నెలవుకాని పట్టణం ఎక్కడుంది
మూడింటిలోనూ అధమాధమము అనిపించుకోకుండా?

కుటుంబ బాధ్యతలు మగాడిని నిద్రపోనీవు,
లేదా, మనసు దొలుస్తూనే ఉంటాయి;
ఒంటరిగా ఉండే వాళ్ళు అదొక శాపం అనుకుంటారు
లేదా అంతకంటే పెద్ద తప్పులు చేస్తారు:
కొందరికి పిల్లలుంటారు, అలా ఉన్నవాళ్ళు, దుఃఖిస్తూ
పిల్లలు లేకున్నా బాగుణ్ణనుకుంటారు;
అప్పుడు ఇక భార్య ఉంటే నేమిటి, లేకుంటే నేమిటి?
ఒంటరి బానిసత్వమో, ద్విగుణమైన పోట్లాటలో తప్ప.

ఇంటిపట్టునే ఉండి సుఖపడాలనుకోవడం
ఒక వ్యాధి;
సముద్రాలు దాటి వేరే ఏదేశంలోనైనా బ్రతుకుదామనుకుంటే
అదొక సంకటమూ, ప్రయాస.
యుద్ధాలు వాటి ధ్వనులతో మనని భయపెడతాయి;
అవి లేనపుడు, శాంతిలో మనం అంతకంటే కనికిష్టం;
ఇంక మనకి మిగిలిందేమిటి, పుట్టినందుకు ఏడవడం తప్ప,
లెదా, పుట్టేం గనక చావడం తప్ప?
.
ప్రాన్సిస్ బేకన్
ఇంగ్లీషు వ్యాసకర్త

జ్ఞాన సముపార్జనలో ఇంద్రియాల ప్రభావం గురించి నొక్కి చెప్పి, అనుభవానికి పెద్ద పీట వేసి, తద్వారా, మతం మీద విజ్ఞానికి ఆధిపత్యం ఆద్యుడైన రచయిత ఫ్రాన్సిస్ బేకన్. ప్రాచీన భారతీయ వైశేషిక తత్త్వ చింతనకు ఆద్యుడైన కణాదుడు, జ్ఞానసముపార్జనకి (ఇంద్రియ)”అనుభూతి”, “అనుమానము” రెండే ప్రమాణాలుగా పేర్కొన్నాడు అన్నది మనం గుర్తుంచుకోవాలి.

.

.

The World

The world ’s a bubble, and the Life of Man
Less than a span:
In his conception wretched, from the womb,
So to the tomb;
Curst from his cradle, and brought up to years
With cares and fears.
Who then to frail mortality shall trust,
But limns on water, or but writes in dust.

Yet whilst with sorrow here we live opprest,
What life is best?
Courts are but only superficial schools
To dandle fools:
The rural parts are turned into a den
Of savage men:
And where ’s a city from foul vice so free,
But may be termed the worst of all the three?

Domestic cares afflict the husband’s bed,
Or pains his head:
Those that live single, take it for a curse,
Or do things worse:
Some would have children: those that have them, moan
Or wish them gone:
What is it, then, to have or have no wife,
But single thraldom, or a double strife?

Our own affection still at home to please
Is a disease:
To cross the seas to any foreign soil,
Peril and toil:
Wars with their noise affright us; when they cease,
We are worse in peace;—
What then remains, but that we still should cry
For being born, or, being born, to die?
.
Francis Bacon

(22 January 1561 – 9 April 1626)
The World’s Best Poetry.
Eds:Bliss Carman, et al.,
Volume III. Sorrow and Consolation. 1904.
III. Adversity
http://www.bartleby.com/360/3/89.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: