రోజు: ఫిబ్రవరి 27, 2016
-
ఈ బ్రతుకు… ఫ్రాన్సిస్ బేకన్, ఇంగ్లీషు రచయిత
ఈ సృష్టి ఒక బుడగ, మనిషి జీవితకాలం అందులో ఒక లిప్త: తల్లి కడుపులోంచి, భూమి కడుపులో దాకా అన్నీ దౌర్భాగ్యపు ఆలోచనలే; ఉయ్యాలనాటినుండి శాపగ్రస్తుడై బాధలతో, భయాలతో జీవీతకాలం ఎదగడమే. ఇక ఎప్పుడు మృత్యువు వస్తుందా అని ఎదురుచూస్తాడు నీటిమీద బొమ్మలేస్తూ, బుగ్గిలో రాసుకుంటూ మనం బాధతో కుంచించుకు పోయి బ్రతుకుతాం గాని ఏ జీవితం బాగుంది గనక? రాజసభలు చూడబోతే మూర్ఖుల్ని బుజ్జగించడానికి పనికొచ్చే పాఠశాలలు; పల్లెలు చూడబోటే ఆటవికులకు ఆలవాలాలుగా మారిపోయాయి ఇక…