రోజు: ఫిబ్రవరి 25, 2016
-
ప్రభుత్వం నడపడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలు… డేవిడ్ హ్యూం, స్కాటిష్ తత్త్వవేత్త
సామాజిక కార్య కలాపాలు తాత్త్విక దృష్టితో చూసే వారికి, అన్నిటికంటే, అతి తక్కువమందిచే అతి ఎక్కువమంది అంత స్పష్టంగా అణిగిమణిగి, తమ పాలకుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తమ అభిప్రాయాలను మలుచుకుని, అంత సులభంగా పరిపాలించబడటం ఆశ్చర్యంగొలపక మానదు. ఇంత ఆశ్చర్యకరంగా ఎలా అమలుపరచగలుగుతున్నారని మనం ఒక సారి తర్కించి చూస్తే, మనకి అసలు అధికారం పాలితుల చేతులో ఉందనీ, పాలకులకు ప్రజాభిప్రాయం తప్ప వారి వెనక మరొకటి లేదనీ స్పష్టం అవుతుంది. కనుక, ప్రభుత్వాలు కేవలం అభిప్రాయం…