పాపాయి… జెరమయ్య ఏమ్స్ రాంకిన్, అమెరికను కవి

తన బుజ్జి కాలివేళ్ళు దాచడానికి జోళ్ళు లేవు
రెండు పాదాలకీ మేజోళ్ళూ లేవు
తన మెత్తని అరికాళ్ళు మంచులా తెల్లన,
అప్పుడే పూచిన పూవులా తీయన.

ఆమె ఆహార్యం కేవలం గులాబి అద్దిన చర్మం
రెండుపక్కలా సొట్టలు పడే చెక్కిళ్ళూ
సన్నని చారలున్న పెదాలూ, బుంగమూతీ
అందులో ఎక్కడా కనిపించని పన్నూ.

రెండు సున్నితమైన చుక్కల్లాంటి
అమ్మకళ్ళను పోలిన కళ్ళూ;
దేవదూత ముఖం లాంటి ముఖం.
అదృష్టం కొద్దీ తనకి రెక్కలు లేవు.

ఆమె మా ప్రేమకు పూచిన పువ్వు
భగవంతుడు మాకిచ్చిన వరం ఆమె,
ఆ వరాన్నొక్కతెనే ప్రేమిస్తూ కూచుంటే
ఆ మేలుబంతి మాకు వరమే కాదు.

మేము ఆ దాతని ఇంకా ప్రేమించాలి
అతన్ని ఈ బహుమతిలో చూసుకోవాలి;
తిన్నగా దేముడిదగ్గరనుండి వచ్చిన ఆమె
మేము దేముని చేరడానికి దారి చూపాలి
.
జెరమయ్య ఏమ్స్ రాంకిన్

(January 2, 1828 – November 28, 1904)

అమెరికను కవి

.

The Babie

 

Nae shoon to hide her tiny taes,

  Nae stockin’ on her feet;

Her supple ankles white as snaw,

  Or early blossoms sweet.

 

Her simple dress o’ sprinkled pink,

  Her double, dimplit chin,

Her puckered lips an’ baumy mou’,

  With na ane tooth within.

 

Her een sae like her mither’s een,

  Twa gentle, liquid things;

Her face is like an angel’s face,

  We ’re glad she has nae wings.

 

She is the buddin’ o’ our luve,

  A giftie God gied us:

We maun na luve the gift owre weel,

  ’T wad be nae blessing thus.

 

We still maun lo’e the Giver mair

  An’ see Him in the given;

An’ sae she ’ll lead us up to Him,

  Our babie straight frae Heaven.

.

Jeremiah Eames Rankin

(January 2, 1828 – November 28, 1904)

American Poet

The World’s Best Poetry.

Eds.: Bliss Carman, et al.

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/7.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: