రోజు: ఫిబ్రవరి 18, 2016
-
ఇల్లు… లియొనిడస్ ఆఫ్ అలెగ్జాండ్రియా, గ్రీకు కవి
నీ ఇంటిని అంటిపెట్టుకో! ఎంత పాడుబడ్డ పాక అవనీ, నిన్ను తలదాచుకోనిస్తుంది, చలికాచుకుందికి ఒక పొయ్యిదొరుకుతుంది. ఎంత పనికిరాని నేల అయినా కూరగాయలు పండకపోవు, తినడానికి దేముడు ఏది అనుగ్రహిస్తే అనుగ్రహించనీ, నది ఒడ్డున విచ్చలవిడిగా మొలిచినవో, కొండ వాలులో అరకొరగా పండినవో, గింజలూ, కందమూలాలూ దొరకకపోవు; ఎంత నిరాశక్తంగా కనిపించినా,ఆ పూరిగుడిశే, ప్రపంచాన్ని పొందినా దొరకని మనశ్శాంతిని ఇస్తుంది సుమా! . (గ్రీకు నుండి అనువాదం: రాబర్ట్ బ్లాండ్) . లియొనిడస్ ఆఫ్ అలెగ్జాండ్రియా గ్రీకు…