కొంటె కోణంగులమై, ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే
అతికాయులం కాని గంధర్వులమైన మమ్మల్ని
వెన్నెల ఎప్పుడూ తోటల్లో కట్టిపడేస్తుంది
తొంగిచూసి, తడవమడానికీ పురికొల్పుతూ.
దొంగతనం చేసిన మిఠాయి తియ్యగా ఉంటుంది
దొంగతనంగా పెట్టుకున్న ముద్దు తనివి తీరుస్తుంది
దేవాలయాల్లో దొంగచూపులు బాగుంటాయి
ఆపిలుపళ్ళ దొంగతనంతోనే కదా కథ మొదలైంది
నిద్రలోకి ప్రపంచం జోగుతున్నప్పుడు
తోటలు కొల్లగొట్టడానికి అదే మంచి అదను
దొంగతనం చెయ్యడం తెచ్చే ఆనందం వల్లగాని,
పళ్ళు తొక్కతీసుకు తినడంలో అంత మజా ఏముంది?
.
థామస్ రాండోల్ఫ్
15 June 1605 – March 1635
ఇంగ్లీషు కవి
(లాటిన్ నుండి ఇంగ్లీషులోకి అనువాదం: లే హంట్)
.
Fairies’ Song
(From the Latin by Leigh Hunt)
WE the fairies blithe and antic,
Of dimensions not gigantic,
Though the moonshine mostly keep us,
Oft in orchards frisk and peep us.
Stolen sweets are always sweeter;
Stolen kisses much completer;
Stolen looks are nice in chapels;
Stolen, stolen be your apples.
When to bed the world are bobbing,
Then ’s the time for orchard-robbing;
Yet the fruit were scarce worth peeling
Were it not for stealing, stealing.
.
Thomas Randolph
(15 June 1605 – March 1635)
The World’s Best Poetry
Bliss Carman, et al., eds. .
Volume VI. Fancy. 1904.
Poems of Fancy: II. Fairies: Elves: Sprites
http://www.bartleby.com/360/6/11.html
స్పందించండి