రోజు: ఫిబ్రవరి 6, 2016
-
నామకరణం… మేరీ లాంబ్, ఇంగ్లీషు రచయిత్రి
నాకో చెల్లెలు పుట్టింది; ఆమెను మొదటముద్దాడినవారి పక్కన నేనున్నాను. నర్సు పొత్తిళ్ళలోపెట్టి తెచ్చి నాన్నకిచ్చినపుడు, ఆ చిన్నిపాపని చూసి నాన్నకళ్ళలో ఎంతవెలుగు కనిపించిందో! దానికి త్వరలోనే పేరుపెట్టాలి. నాన్న నాకు అవకాశం ఇచ్చారు మా చెల్లికి నన్నే పేరుపెట్టమని. ఏ పేరు పెడితే తనకు నచ్చుతుంది చెప్మా! చార్లెట్, జూలియా, లేక లూయిజా? ఏన్, లెదా మేరీ? అవి అందరూ పెట్టుకునేవే. జోన్ అంటే, ఆడవాళ్ళకి మరీ సాంప్రదాయకంగా ఉంటుంది, పైగా జేన్ అంతకంటే బాగుంటుంది. కానీ…