రోజు: ఫిబ్రవరి 3, 2016
-
పోర్షియా చిత్రపటం… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం ఇది పోర్షియా సుందరి ప్రతిమా? ఏ దివ్యాంశ సంభూతుడు సృష్టికి అతిదగ్గరగా రాగలిగేడు? ఆ కళ్ళు కదుల్తున్నాయా? లేక, నా కనుగుడ్లమీద కదులుతూ అవి కదులుతున్నట్టు అనిపిస్తోందా? అవిగో విప్పారిన పెదాలు, మధురమైన శ్వాసతో దూరమయ్యాయి; ఎంత అందమైన పలువరుస అంత ప్రియమైన స్నేహితులని ఎడబాయ వలసివచ్చిందో గదా! ఇవిగో ఆమె కురులు, చిత్రకారుడు సాలీడులా ఆడుకున్నాడు; పురుషుల హృదయాలను కొల్లగొట్టడానికి పసిడివన్నె వల అల్లేడు, సాలెగూడులో…