రోజు: ఫిబ్రవరి 1, 2016
-
స్త్రీల బృందగానం… ఏరిస్టొఫేన్స్, గ్రీకు కవి
వాళ్ళకి మనం పీడలమని మగవాళ్ళెప్పుడూ మనని నిందిస్తుంటారు: వాళ్ళ దుఃఖాలన్నిటికీ మూలకారణం మనమేనని పదే పదే చెబుతుంటారు; యుద్ధానికీ, కలహాలకీ, రక్తపాతానికీ, అన్ని తుంటరి పనులకీ, ఒకటేమిటి, కారణం మనమే! వాళ్ళకి మనం అంత పీడలమైనపుడు, మనని పెళ్ళెందుకు చేసుకుంటారు చెప్పు? మనల్ని ఇళ్ళలో భద్రంగా దాచుకుని మనగురించి అంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటారు? మనం పొరపాటున బయటకి వెళ్ళవలసి వస్తే ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఎందుకుండలేరు? హమ్మయ్య పీడ విరగడయ్యిందని దేముడికి ధన్యవాదాలు చెప్పకుండా,…