నెల: ఫిబ్రవరి 2016
-
అటునుండి ఇటు… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
లే! లే, మిత్రమా! పుస్తకాల్ని పక్కన పడెయ్. లేకపోతే నువ్వు రెండురెట్లు లావు అవుతావు. లే! లే, మిత్రమా! లేచి కళ్ళు తుడుచుకో! ఎందుకొచ్చిన శ్రమ ఇదంతా నీకు ? చూడు, సూర్యుడు పడపటికొండ శిఖరాన ఎంత లావణ్యంతో మెరుస్తున్నాడో విశాలమైన ఈ పచ్చిక చేలమీద మనోహరంగా తన బంగారువన్నె నీరెండ పరుస్తున్నాడు. ఆహ్, పుస్తకాలు! స్వారస్యంలేని ఆ గోల ఎప్పుడూ ఉండేదేలే, రా, చిట్టడవిలోని ఆ పిట్టపాట విను. ఎంత మధురంగా ఉంది ఆ పాట!…
-
విశ్వాసము… జార్జి శాంతాయన, స్పానిష్- అమెరికన్ కవి
ఈ మధ్యకాలంలో నేను చదివిన అపురూపమైన కవితల్లో ఇదొకటి. ఓ ప్రపంచమా! నువ్వు ఉత్తమంగా ఉండాలని ఎందుకనుకోవు? తెలివి అంటే, కేవలం జ్ఞానాన్ని సంపాదించి, అంతర్దృష్టితో దేన్నీ చూడకుండా కళ్ళుమూసుకోవడం కాదు, తెలివంటే, మనసుమీద పూర్తి విశ్వాసం కలిగి ఉండడం. కొలంబస్ ఒక ప్రపంచాన్నే కనుక్కోగలిగేడు, నక్షత్రాలస్థితిని చూసి అర్థంచేసుకోగల నమ్మకం తప్ప; మార్గదర్శనానికి అతని దగ్గర ఏ సముద్రపటాలూ లేవు, మనసు విశ్లేషించినదానిపై అచంచల విశ్వాసమే అతని శాస్త్రపరిజ్ఞాన పరిధీ, అతని ఏకైక అభినివేశమూ. మన…
-
ఈ బ్రతుకు… ఫ్రాన్సిస్ బేకన్, ఇంగ్లీషు రచయిత
ఈ సృష్టి ఒక బుడగ, మనిషి జీవితకాలం అందులో ఒక లిప్త: తల్లి కడుపులోంచి, భూమి కడుపులో దాకా అన్నీ దౌర్భాగ్యపు ఆలోచనలే; ఉయ్యాలనాటినుండి శాపగ్రస్తుడై బాధలతో, భయాలతో జీవీతకాలం ఎదగడమే. ఇక ఎప్పుడు మృత్యువు వస్తుందా అని ఎదురుచూస్తాడు నీటిమీద బొమ్మలేస్తూ, బుగ్గిలో రాసుకుంటూ మనం బాధతో కుంచించుకు పోయి బ్రతుకుతాం గాని ఏ జీవితం బాగుంది గనక? రాజసభలు చూడబోతే మూర్ఖుల్ని బుజ్జగించడానికి పనికొచ్చే పాఠశాలలు; పల్లెలు చూడబోటే ఆటవికులకు ఆలవాలాలుగా మారిపోయాయి ఇక…
-
ప్రేమ ఎప్పుడు ఉదయిస్తుంది? … పెకెన్ హాం బియాటీ , ఐరిష్ కవి
కొందరికి ఆలస్యంగా దొరుకుతుంది, కొందరికి త్వరగా, కొందరికి మల్లెలతో వసంతంలో, కొందరికి సంపెంగలతో వర్షర్తువులో, మరికొందరికి హిమంతంలో చేమంతులతో. ప్రేమ కొందరిని మెరిసే కనులతో పలకరిస్తే కన్నీరు నింపుతూ కొందరిని చేరుకుంటుంది; ప్రేమ కొందరిని గీతాలాలపింపజేస్తే, కొందరిని నిరాశతో నిట్టూర్పు విడిచేట్టు చేస్తుంది, కొందరితోనయితే, ప్రేమ అసలు పెదవే విప్పదు; అందమైన ఓ ప్రేమా! నా దగ్గరికి ఎలా వస్తావు? నువ్వు తొందరగా వస్తావా, ఆలస్యంగా వస్తావా? సూర్యుని వెలుగుతోనో, చంద్రుని వెన్నెలతోనో ఆకసం నిండుతుందా, లేక…
-
ప్రభుత్వం నడపడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలు… డేవిడ్ హ్యూం, స్కాటిష్ తత్త్వవేత్త
సామాజిక కార్య కలాపాలు తాత్త్విక దృష్టితో చూసే వారికి, అన్నిటికంటే, అతి తక్కువమందిచే అతి ఎక్కువమంది అంత స్పష్టంగా అణిగిమణిగి, తమ పాలకుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తమ అభిప్రాయాలను మలుచుకుని, అంత సులభంగా పరిపాలించబడటం ఆశ్చర్యంగొలపక మానదు. ఇంత ఆశ్చర్యకరంగా ఎలా అమలుపరచగలుగుతున్నారని మనం ఒక సారి తర్కించి చూస్తే, మనకి అసలు అధికారం పాలితుల చేతులో ఉందనీ, పాలకులకు ప్రజాభిప్రాయం తప్ప వారి వెనక మరొకటి లేదనీ స్పష్టం అవుతుంది. కనుక, ప్రభుత్వాలు కేవలం అభిప్రాయం…
-
Why Did I laugh Tonight? John Keats
ఈ రోజు కీట్స్ వర్ధంతి మృత్యుముఖంలో కూడా ఆర్ద్రమూ, రసభరితమేగాక, ఉన్నతమైన తాత్త్వికభావనలతో నిండిన ఎంతటి గొప్ప కవిత అందించేడో చూడండి. ఈ రాత్రి నాకు నవ్వెందుకొచ్చింది? ఎవరూ చెప్పలేరు. నిష్ఠగా సమాధానం చెప్పగల ఏ దేముడూ, ఏ దయ్యమూ స్వర్గం నుండి గాని, నరకంనుండి గాని దయతో కరుణించదు. కనుక నేను శీఘ్రమే మనసులోకి తోంగిచూసుకోవాలి: ఓ మనసా! మనిద్దరం కలిసి, ఒంటరిగా, విషణ్ణంగా ఇక్కడ ఉన్నాంగదా, నాకు నవ్వెందుకొచ్చిందో చెప్పవూ? అబ్బా ఈ బాధం…
-
పాపాయి… జెరమయ్య ఏమ్స్ రాంకిన్, అమెరికను కవి
తన బుజ్జి కాలివేళ్ళు దాచడానికి జోళ్ళు లేవు రెండు పాదాలకీ మేజోళ్ళూ లేవు తన మెత్తని అరికాళ్ళు మంచులా తెల్లన, అప్పుడే పూచిన పూవులా తీయన. ఆమె ఆహార్యం కేవలం గులాబి అద్దిన చర్మం రెండుపక్కలా సొట్టలు పడే చెక్కిళ్ళూ సన్నని చారలున్న పెదాలూ, బుంగమూతీ అందులో ఎక్కడా కనిపించని పన్నూ. రెండు సున్నితమైన చుక్కల్లాంటి అమ్మకళ్ళను పోలిన కళ్ళూ; దేవదూత ముఖం లాంటి ముఖం. అదృష్టం కొద్దీ తనకి రెక్కలు లేవు. ఆమె మా ప్రేమకు పూచిన…
-
A wretched Mother… Madduri Nagesh Babu, Telugu, Indian
Did you ever notice a pool of tears In front of any government hospital’s mortuary? That was just my mother, sir! Did you ever encounter a lone cross lying by a pit That was not fortunate enough to find a grave to stand by? That was also my mother, Sir! My mother was not Yasoda.…
-
ఇల్లు… లియొనిడస్ ఆఫ్ అలెగ్జాండ్రియా, గ్రీకు కవి
నీ ఇంటిని అంటిపెట్టుకో! ఎంత పాడుబడ్డ పాక అవనీ, నిన్ను తలదాచుకోనిస్తుంది, చలికాచుకుందికి ఒక పొయ్యిదొరుకుతుంది. ఎంత పనికిరాని నేల అయినా కూరగాయలు పండకపోవు, తినడానికి దేముడు ఏది అనుగ్రహిస్తే అనుగ్రహించనీ, నది ఒడ్డున విచ్చలవిడిగా మొలిచినవో, కొండ వాలులో అరకొరగా పండినవో, గింజలూ, కందమూలాలూ దొరకకపోవు; ఎంత నిరాశక్తంగా కనిపించినా,ఆ పూరిగుడిశే, ప్రపంచాన్ని పొందినా దొరకని మనశ్శాంతిని ఇస్తుంది సుమా! . (గ్రీకు నుండి అనువాదం: రాబర్ట్ బ్లాండ్) . లియొనిడస్ ఆఫ్ అలెగ్జాండ్రియా గ్రీకు…
-
నీకు నా కవితలు నచ్చితే…ఇ. ఇ. కమ్మింగ్స్, అమెరికను కవి
నీకు నా కవితలు నచ్చితే సాయంత్రం వేళ వాటిని కొద్ది దూరంలో నీ వెనుక అనుసరించనీ. అప్పుడు ప్రజలు అంటారు: “ఈ త్రోవలో నేనొక రాకుమారి వెళ్ళడం చూశాను తన ప్రియుడిని కలుసుకోడానికి … (అప్పటికి చీకటి పడింది) ఆమె వెనుక ఏమీ తెలియని, పొడగరులైన పొడవైన, సైనికులు అనుసరించడం చూశాను. . ఇ. ఇ. కమ్మింగ్స్ అమెరికను కవి If you like my poems… let them . if you like…