నెల: జనవరి 2016
-
జీవనవిహారం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
మనిద్దరం వినీలాకాశం క్రింద మహానగాగ్రాల శిఖరాలపై రెక్కలు బారజాపుకుని గాలిలో జంటగా ఎగిరే పక్షులం. సూర్యకాంతి మనని రంజిస్తుంది పేరుకున్న మంచు విస్మయపరుస్తుంది పల్చబడి చెదురై, చిక్కులుపడుతూ మన వెనక మేఘాలు గిరికీలుకొడతాయి మనిద్దరం పక్షులులాంటి వారిమి; కానీ మృత్యువు తరుముకొచ్చి దానికి మర్త్యులమై మోకరిల్లినపుడు, మనలో ఒకరు నిష్క్రమించగానే, రెండవవారు అనుసరింతురు గాక! ఈ గగనవిహారము ముగియుగాక! చితిమంటలు చల్లారుగాక! పుస్తకము మూసివెయ్యబడుగాక! . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29,…
-
పాపాయి… జార్జి మెక్డొనాల్డ్, స్కాటిష్ కవి
ప్రియమైన పాపాయీ ఎక్కడనుండి ఇక్కడకు వచ్చేవు? ఈ విశాల విశ్వంలోంచే నీదగ్గరకు వచ్చేను? నీ కళ్ళు ఎందుకు అంత అందంగా నీలంగా ఉన్నాయి? ఓ అదా, నేను వస్తుంటే ఆకాశం రంగు అంటుకుంది ఆ కళ్ళలో వెలుగులెందుకు చక్రాల్లా తిరిగి మెరుస్తున్నాయి? అందులో నక్షత్రాల తునకలు కొన్ని చిక్కుపడిపోయాయి నీ కన్నుల్లో అస్రుకణం ఎక్కడినుండి వచ్చింది? నేనిక్కడికొచ్చేసరికి నాకై అది ఎదురుచూస్తోంది. నీ నుదురెందుకు మెత్తగా ఉన్నతణ్గా కనిపిస్తోంది? ఓ అదా, మెత్తని చెయ్యొకటి నే వస్తుంటే…
-
సానెట్ 8… షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం *** వినగల మధురగీతమున్నప్పుడు, విషాదగీతమేలవినాలి? తియ్యందనాలు పోట్లాడుకోవు, ఒకదాని సన్నిధిలో ఒకటి అతిశయిస్తాయి నీకు ఆనందంతో సమర్పింపబడనిదాన్ని బలవంతంగా ప్రేమించడమెందుకు? నీకు చిరాకుకలిగించేదాన్ని ప్రేమగా స్వాగతించడమెందుకు? ఒద్దికగా కలగలిసిన స్వర అనుస్వరాలమేళవింపు వాటి సమాగమం నీ చెవులకు ఇంపుగా వినిపించడంలేదంటే, ఒంటరితనంలో భరించవలసి వస్తున్న విషయాలకూ ఆ భ్రమకు… నిన్ను సుతిమెత్తగా మందలిస్తున్నాయన్నమాట. ఒకసారి గమనించు, ఒక తీగ, రెండవదానికి సరిగ్గా తగిన జోడీ ఒకదాని నొకటి ప్రోత్సహించుకుంటూ రాగమధురమౌతున్నాయి.…
-
నేను పవనాన్ని… జో ఏకిన్స్, అమెరికను
నేను నిలకడలేని పవనాన్ని నువ్వు నిశ్చలమైన ధరిత్రివి; నేను ఇసుకమీద అటూ ఇటూ కదలాడే నీడని. నేను గాలికి అల్లల్లాడే పత్రాన్ని నువ్వు తొణకక నిలబడే వృక్షానివి; నువ్వు తన ఉనికినుండి కదలని నక్షత్రానివి నేను చంచలమైన సముద్రాన్ని. నువ్వు శాశ్వతమైన వెలుగువి నేను దివిటీలా సమసిపోతాను; నువ్వు రసార్ణవంలో ముంచెత్తే సంగీతానివి నేను? … ఒక కేకని. . జో ఏకిన్స్ (30 October 1886 – 29 October 1958) అమెరికను కవయిత్రి .…
-
నూత్నసంవత్సరం… గేథే , జర్మను కవి
బ్లాగు మిత్రులకీ, శ్రేయోభిలాషులకీ, వారి కుటుంబాలకీ నూతన ఆంగ్ల సంవత్సరం 2016 ఉజ్జ్వలమైన భవిష్యత్తుకి కొత్తమార్గాలు కొనిరావడమే గాక, గతకాలపు సమస్యలకి మంచిసమాధానాలు కూడా తీసుకురావాలని అభిలషిస్తున్నాను. కాలం చేసిన గాయాలని కాలమే మాన్పుతుంది. గత సంవత్సరంలో తగిలిన గాయాలు ఈ సంవత్సరం జ్ఞాపకాలుగా మిగిల్చిపోవాలని ఆశిస్తున్నాను. **** (1802 లో గేథే ఇంట్లో జరిగిన జరిగిన ఒక విందు ప్రేరణతో 1804లో వ్రాసిన కవిత) ఓ విధీ! కొత్తగా ప్రారంభించడానికీ మరలిపోవడానికీ మధ్య ఆనందంగా ఉండేలా…