విశాలఖగోళం… జోసెఫ్ ఎడిసన్, ఇంగ్లీషు కవి
ఎంతో ఎత్తున వ్యాపించిన ఖగోళము
తన దివ్యమైన నీలి ఆకాశంతో సహా,
చుక్కలుపొదిగిన స్వర్గం, మెరిసే ఖచక్రం,
వాటి ఆదిమత్వాన్ని చెప్పకనే చెబుతుంటాయి.
అలసటలేని సూర్యుడు, ప్రతిరోజూ
తనసృష్టికర్త శక్తిని ప్రకటిస్తాడు,
సర్వశక్తిమయుడైన ఆ భగవంతుని సృష్టిని
ప్రతి నేలమీదా చాటింపు వేస్తుంటాడు.
ఇమతలో సాయం సంధ్య కమ్ముకుంటూంటే
చంద్రుడు ఆ రసవత్తరమైన కథ అందుకుంటాడు
ఆమె పుట్టుక పూర్వ వృత్తాంతాన్ని
రాత్రంగా భూమికి వినిపిస్తాడు;
తనచుట్టూ చుక్కలకాగడాలు మండుతుంటే;
ఒక ధృవంనుండి మరొక ధృవానికి
గ్రహాలన్నీ తమగతుల్లో దొర్లుతూ,
తమవంతుగా, సత్యాన్ని వచిస్తుంటే
అవన్నీ, నిబిడనిశ్శబ్దంలో తిరిగితేనేమి?
అన్నీ ఒక నల్లటి బంతి చుట్టూ తిరిగితేనేమి?
వాటి తేజోవంతమైన భ్రమణమార్గాల్లో
ఒక శబ్దంగానీ, మాతగాని వినిపించకపోతేనేమి?
మెరుస్తూ, ఒక అద్భుతమైన గొంతుకతో
అవి అను నిత్యం ఆలపిస్తున్నాయి
హేతువుచెవులో ఊదుతూ ఆనందిస్తున్నాయి
“మనల సృష్టించిన ఆ చెయ్యి దైవానిది!” అని.
.
జోసెఫ్ ఎడిసన్
(1 May 1672 – 17 June 1719)
ఇంగ్లీషు కవి
.
Ode: “The spacious firmament on high”
.
The spacious firmament on high,
With all the blue ethereal sky,
And spangled heavens, a shining frame,
Their great Original proclaim;
The unwearied sun, from day to day,
Does his Creator’s power display,
And publishes to every land
The work of an Almighty hand.
Soon as the evening shades prevail,
The moon takes up the wondrous tale,
And nightly to the listening earth
Repeats the story of her birth;
While all the stars that round her burn,
And all the planets in their turn,
Confirm the tidings as they roll,
And spread the truth from pole to pole.
What though, in solemn silence, all
Move round the dark terrestrial ball?
What though no real voice or sound
Amid their radiant orbs be found?
In Reason’s ear they all rejoice,
And utter forth a glorious voice,
Forever singing, as they shine,
“The hand that made us is divine!”
.
(From “The Spectator”)
.
Joseph Addison
(1 May 1672 – 17 June 1719)
English Poet
The World’s Best Poetry.
Bliss Carman, et al., eds.
Volume IV. The Higher Life. 1904.
-
The Divine Element—(God, Christ, the Holy Spirit)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి