ఏ అందమైన వస్తువైనా మనుషుల్లో
నిష్కల్మషమూ, యోగ్యమూ ఐన కోర్కెలు రగులుస్తందంటే,
అందానికి ఆటపట్టైన ఈ భూమ్యాకాశాల మధ్య, అది
నా ప్రేయసి వంటిదై ఉండాలని నమ్ముతాను; ఎందుకంటే
అంత అందమైన ఆమెలో, (ఆమె సమక్షంలో సర్వం మరిచిపోతాను),
నాకు భగవంతుని అద్భుతమైన సృష్టినైపుణ్యం కనిపిస్తుంది,
నాకు ఏ ఇతర వస్తువులగురించీ ధ్యాసే ఉండదు
ఆమె ప్రేమలో మగ్నమై ఉన్నంతవరకు. అందులో వింతేమీ లేదు,
ఎందుకంటే ఆ ప్రభావం తప్పించుకోడం నా వశంలో లేదు,
ఆమె కనులు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేస్తే
ఆత్మ వశమై, నా మనసు ఆకర్షణకు లోనైతే
ఆ కళ్ళను పోలిన కన్నుల్లోనే విశ్రాంతి,
వాటి ద్వారానే ఆదిమ ప్రేమభావనలకు అంకురార్పణ,
దాని ఫలశృతి, అభినందనల పరంపరే.
దైవాన్ని ప్రేమించేవాడు, అతని సృష్టినీ ప్రేమించాలి.
.
మైకేలేంజెలో
March 1475 – 18 February 1564
ఇటాలియన్ కవి
.
“If it be true that any beauteous thing”
If it be true that any beauteous thing
Raises the pure and just desire of man
From earth to God, the eternal fount of all,
Such I believe my love; for as in her
So fair, in whom I all besides forget,
I view the gentle work of her Creator,
I have no care for any other thing,
Whilst thus I love. Nor is it marvellous,
Since the effect is not of my own power,
If the soul doth, by nature tempted forth,
Enamored through the eyes,
Repose upon the eyes which it resembleth,
And through them riseth to the Primal Love,
As to its end, and honors in admiring;
For who adores the Maker needs must love his work.
.
(Translated From the Italian by John Edward Taylor)
Michaelangelo
(1475–1564)
Poem Courtesy:
The World’s Best Poetry
Bliss Carman, et al., eds. .
Volume II. Love. 1904.
-
Love’s Nature
స్పందించండి