శిసుస్తవం… విలియం కాంటన్, ఇంగ్లీషు కవి

శిశుస్తవంగా నే చెప్పదలుచుకున్నదేమంటే
దేముడు ముందు మనిషిని సృష్టించాడు, రెండోసారి
అంతకంటే మెరుగుగా స్త్రీనీ, మూడోసారి అత్యుత్తమైనదీ సృష్టించేడు.
అతని సృష్టిలో అన్నిటిలోకీ అందమైనవీ
దివ్యత్వం తొణికిసలాడేదీ శిశువులే. ఇక్కడి
ఏ వస్తువూ అంతకంటే ప్రియమైనదీ,సుందరమైనదీ కాదు.
భగవంతుడు తన సృష్టి అంతా సంతృప్తిగా చూసినా
శైశవాన్ని మించిన గులాబి పువ్వు మరొకటి లేదు.
తర్వాత రోజుల్లో పిల్లలగురించి ఇలా చెప్పబడింది:
వాళ్ళవంటివారికి తప్ప స్వర్గంలో ప్రవేశం లేదు.

ఓ చిన్ని పాపాయీ! ముళ్ళు వికసించడం చూస్తున్న ఈ భూమి
నువ్వు పుట్టడం చూసి ఆనందంతో తన్మయత్వం చెందింది.
స్కై లార్కులు వినీలాకాశాంలోకి ఎగరడం చూసి పరవసించే ధరణి
నిను చూసి తనకు తానై భగవద్విలాసానికి విహరించసాగింది.

ముచ్చటతో పచ్చికమీది మంచుబిందువుపైకి ఒంగి
అందులో తనప్రతిబింబాన్ని చూసుకుందికి ఆరాటపడే స్వర్గం,
నీ ముఖం అంత స్వచ్చంగా, ప్రసన్నంగా ఉండడం చూసి మురిసి
ఓ పాపాయీ, తన ప్రతిబింబాన్ని నీ దగ్గర విడిచి వెళ్ళిపోయింది.
.

విలియం కాంటన్

(27 October 1845 – 2 May 1926)

ఇంగ్లీషు కవి

.

Laus Infantium

In praise of little children I will say  

God first made man, then found a better way     

For woman, but his third way was the best.       

Of all created things, the loveliest    

And most divine are children. Nothing here        

Can be to us more gracious or more dear. 

And though, when God saw all his works were good,  

There was no rosy flower of babyhood,    

’T was said of children in a later day        

That none could enter Heaven save such as they.

The earth, which feels the flowering of a thorn,  

Was glad, O little child, when you were born;     

The earth, which thrills when skylarks scale the blue,  

Soared up itself to God’s own Heaven in you;   

And Heaven, which loves to lean down and to glass    

Its beauty in each dewdrop on the grass,—        

Heaven laughed to find your face so pure and fair,      

And left, O little child, its reflex there.

.

William Canton

(27 October 1845 – 2 May 1926)

English Poet

Poem Courtesy:

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds. 

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/5.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: