అనువాదలహరి

పాపాయి బరువెంత?… ఎథ్ లెండా ఏలియట్ బీర్స్, అమెరికను కవయిత్రి

నెల్లాళ్లక్రిందటే దివినుండి దిగివచ్చిన
పాపాయి ఎన్ని పౌండ్లు తూగుతుందబ్బా?
ఎంతబరువుంటుందో కిరీటంలాటి వంకీ నుండి
అవిశ్రాంతమైన గులాబిరంగు బొటనవేలివరకు?

తాతగారు చేతిరుమాలు ఊయలలా ముడివేసి
లోలకంలా ఊగుతున్నదాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు,
జారిపోతున్న కళ్ళజోడుమీంచి జాగ్రత్తగా పరికించి
“ఎనిమిది పౌన్లే” అంటూ ముల్లును చూసి చెప్పేరు.

మెల్లిగా ఆ మాట ప్రతినోటికీ పాకిరింది
చిట్టితల్లిని చూసి తండ్రి ఆనందంతో నవ్వేడు
చక్కనైన మాతృమూర్తి పాటలు పాడుతుంటే
నాయనమ్మ చిన్నదాని ముంగురులు సవరిస్తోంది.

అపురూపమైన చిన్నారి మీదకి వాలి,
ఒద్దికగా ఒక ముద్దు పెట్టుకుంది మనసులో ఏవో చదువుకుంటూ,
లాలిస్తూ పాపాయితో మంద్రస్వరంలో ఇలా అంది:
“తాతగారు సరిగ్గా నిన్ను తూచలేదు కదమ్మా?”

ఎవరూ పాపాయి చిరునవ్వు తూకం వెయ్యలేరు,
ఆ శిసువుతోపాటే వచ్చిన ప్రేమనీ కొలవలేరు;
ఎవ్వరూ ఆ చిన్నారి ప్రేమ పాశాలని కొలవలేరు
ఆ తల్లి జీవితాన్ని కట్టిపడేసే బంధాలవి

ఏ సూచికలూ ఖచ్చితంగా అంచనా వెయ్యలేవు
ఆ చిన్నారి తీసుకునే ప్రశాంతమైన ఊపిరి విలువెంతో-
నెమ్మదిగా, విరామం లేకుండా లయాన్వితంగా
ఓపికగా, నిష్టగా, కడదాకా కొట్టుకుంటుంది.

ఆ పాపాయి ఆత్మని ఎవరూకొలవలేరు,
ఇక్కడ ఈ భూమి మీద దాన్ని కొలవగల
సాధనాలు లేవు; దేవునుకే ఎరుక
సృష్టిలో దాని అనంతమైన విలువ ఎంతో.

ఏ దేవత వెండివన్నెల రెక్కలసాయంలేకుండా
వచ్చిన ఆ ఆత్మను ఒడిసిపట్టేది ఎనిమిది పౌన్లేనా?
మానవదేహపు దేవళంలో కొలువై వెలుగొందుతోంది
ఇంత చిన్ని, సున్నితమైన శరీరంలో

ఓ కన్న తల్లీ! మనసారా నవ్వుకో,
హాయిగా ఆనందంగా ఉండు, కానీ ఒకవిషయం మరువకు
ఆ చిన్నారి కళ్ళలోంచి ఒక ఆత్మ తొంగి చూస్తోంది
తను వచ్చిన స్వర్లోకపు ఇంటి స్పృహ పోలేదింకా.
.
ఎథ్ లెండా ఏలియట్ బీర్స్, (ఎథెల్ లిన్)

(January 13, 1827 – October 11, 1879)

అమెరికను కవయిత్రి

.

 

Weighing the Baby

“How many pounds does the baby weigh—       

  Baby who came but a month ago? 

How many pounds from the crowning curl         

  To the rosy point of the restless toe?”     

Grandfather ties the ’kerchief knot, 

  Tenderly guides the swinging weight,      

And carefully over his glasses peers

  To read the record, “Only eight.”   

Softly the echo goes around:  

  The father laughs at the tiny girl;   

The fair young mother sings the words,    

  While grandmother smooths the golden curl.    

And stooping above the precious thing,    

  Nestles a kiss within a prayer,       

Murmuring softly “Little one, 

  Grandfather did not weigh you fair.”       

Nobody weighed the baby’s smile,  

  Or the love that came with the helpless one;     

Nobody weighed the threads of care,         

  From which a woman’s life is spun.        

No index tells the mighty worth       

  Of a little baby’s quiet breath—    

A soft, unceasing metronome,

  Patient and faithful until death.      

Nobody weighed the baby’s soul,    

  For here on earth no weights there be      

That could avail; God only knows   

  Its value in eternity.    

Only eight pounds to hold a soul     

  That seeks no angel’s silver wing, 

But shrines it in this human guise,   

  Within so frail and small a thing!   

Oh, mother! laugh your merry note,

  Be gay and glad, but don’t forget  

From baby’s eyes looks out a soul  

  That claims a home in Eden yet.

.

Ethelinda Elliott Beers (Ethel Lynn)

(January 13, 1827 – October 11, 1879)

 American Poetess 

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al. 

Volume I. Of Home: of Friendship.  1904.

 Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/4.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: