ఓ చంద్రమా! ఎంత మౌనంగా బరువుగా అడుగులేస్తూ ఆకశానికి ఎగబ్రాకుతున్నావు! ఎంతగా అలసిపోయింది నీ వదణం! ఏమిటి? అక్కడ స్వర్గంలో కూడా తీరుబాటు లేకుండా పూవిలుకాడు తన వాడి బాణాలు ప్రయోగిస్తున్నాడా? ప్రేమంటే ఏమిటో చిరపరిచయమున్న నాకళ్ళతో పరీక్షించినపుడు నీది తప్పకుండా ప్రేమికుడిబాధలాగే కనిపిస్తోంది; నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది; నీ సొగసులేమి చెబుతోంది; సరి వేదన అనుభవిస్తున్న నాకు, నీ స్థితి అర్థం అయింది. సహబాధితుడిగా, ఓ చంద్రమా నాకు తెలియక అడుగుతాను చెప్పు ఎడతెగని ప్రేమ అంటే బుద్ధిలేని తనంతో సమానమా? అక్కడకూడా ఇక్కడిలాగే గర్విష్టులైన అందగత్తెలున్నారా? వాళ్లు ప్రేమింపబడడానికి అతీతులా? అయినా, ప్రేమించిన వాళ్ళని చిన్న చూపుచూస్తారా? వాళ్ళు ఒక సుగుణాన్ని కృతఘ్నతగా భావిస్తారా? .
సర్ ఫిలిప్ సిడ్నీ
ఇంగ్లీషు కవి
Sonnet 31
.
With how sad steps, O Moon, thou climb’st the skies!