అనువాదలహరి

కల్పన… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి

ఓ కల్పనా! నీ జీమూత గుహలనుండి బయటకి రా!

నీ వన్నె వన్నెల రెక్కలను విస్తరించు.

ఇప్పుడు నీ అన్ని ఆకారాలూ అంగీకారమే

వస్తువుల అన్ని స్వరూపాలూ ఆమోదయోగ్యమే;

ఒక ఉధృత ప్రవాహంలా ఊహాచిత్రాలు సృష్టించు,

అవి రక్తమాంసాలు కలిగి ఉండాలి, జడత్వాన్ని కాదు;

అవి వట్టి పగటి కలలు అయితే అవనీ,

కానీ అవి సుగంధంలా తేలిపోవాలి

అన్ని ఇంద్రియాలనూ లోబరచుకోవాలి,

మా కళ్ళమీద నిద్రలా అల్లనల్లన వాలాలి

లేదా సంగీతంలా చెవులపడాలి.

.

బెన్ జాన్సన్

(11 June 1572 – 6 August 1637)

ఇంగ్లీషు కవి

.

Fantasy

.

Break, Fantasy, from thy cave of cloud,

And spread thy purple wings,

Now all thy figures are allowed,

And various shapes of things;

Create of airy forms a stream,

It must have blood, and naught of phlegm;

And though it be a waking dream,

Yet let it like an odor rise

To all the senses here,

And fall like sleep upon their eyes,

Or music in their ear.

(From “The Vision of Delight”)

.

Ben Jonson

(11 June 1572 – 6 August 1637)

The World’s Best Poetry

Bliss Carman, et al., eds.  .

Volume VI. Fancy.  1904.

Poems of Fancy: I. The Imagination

http://www.bartleby.com/360/6/1.html

%d bloggers like this: