అనువాదలహరి

ప్రభాతసమయం… సర్ విలియం డేవినంట్, ఇంగ్లీషు కవి

భరతపక్షి తన జలస్థావరాన్ని విడిచి,

మంచుపేరిన రెక్కలల్లార్చి గాలిలోకి ఎగురుతోంది,

ప్రభాతమా! తూరుపున నీ కిటికీ తలుపు తడుతోంది

వెలుగునభ్యర్థిసూ, అవ్యక్తగీతాలాలపిస్తోంది;

లే! లే! నీ కన్నుల్లో తన అందాన్ని సరిదిద్దుకోకుండా

ఉదయకాంత బయటకి రాలేదులే.

వేగుచుక్కకి వర్తకుడు వేయి దండాలు పెట్టుకుంటున్నాడు

హాలికుడు అరుణబింబాన్నిబట్టి ఋతువులు లెక్కిస్తున్నాడు;

తన ప్రేయసి కంటే ముందులేచిన ప్రియుడు

ఆ రేండూ ఏమిటో తెలియక వింతగా చూస్తున్నాడు.

లే! లే! ఆ మంచుముసుగునుచీల్చుకుని రా

ప్రభాతమా! చీకటితెరలు తీసి, రోజుకి నాంది పలుకు.

.

సర్ విలియం డేవినంట్

(baptised 3 March 1606 – 7 April 1668)

ఇంగ్లీషు కవి, నాటక కర్త

 

.

Daybreak

The Lark now leaves his watery nest,

And climbing shakes his dewy wings,

He takes your window for the east,

And to implore your light, he sings;

Awake, awake, the morn will never rise,

Till she can dress her beauty at your eyes.

The merchant bows unto the seaman’s star,

The ploughman from the sun his season takes;

But still the lover wonders what they are,

Who look for day before his mistress wakes:

Awake, awake, break through your veils of lawn!

Then draw your curtains and begin the dawn.

.

Sir William Davenant

(baptised 3 March 1606 – 7 April 1668)

English Poet

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al.

Volume II. Love.  1904.

  1. Admiration

http://www.bartleby.com/360/2/2.html

%d bloggers like this: