అనువాదలహరి

మండుతున్న పొద… ఫాస్టర్ డేమన్, అమెరికను

ఈ అనంత విశ్వంలో నిలబడి ఒక రోజు
నన్ను నేను ఒక మహావృక్షంగా ఊహించుకున్నాను
అంతే, నా గుండె అమాంతం పచ్చగా మెరుస్తూ
వ్యాపించే చిగురాకుల్లా ముందుకు చొచ్చుకుపోసాగింది
నా చేతులు నాకు సజీవమైన చెట్టుకొమ్మల్లా అనిపించి
నా శరీరం వింత అనుభూతిని పునః పునః అనుభవించింది.
నా వెన్నులోంచి ఒక్క సారిగా జీవ ప్రసరణ
గుండెలోంచి రక్తం దూకినట్టు కొనసాగింది.

నీ చెప్పులు పక్కన విడిచిపెట్టు (నిశ్శబ్దం)
నీ పాదాన్ని ఒక పవిత్రస్థలంలో ఉంచు.

నా నగ్న శరీరాన్ని గాలికి అంకితం చేసి
అన్ని వృక్షాల్లోనూ దిగంబరమైన వృక్షంలా
చేతులు బారజాపుకుని మళ్ళీ నిలబడ్డాను
నా శరీరం మీద ఒక్క నూలుపోగుంటే ఒట్టు

అపుడు నా అంతరాంతరాలలోంచి పెనుబొబ్బతో
ఒక మహత్తరమైన పారవశ్యం పెల్లుబికింది.
నా కొమ్మలూ, పువ్వులూ కళకళలాడుతూ
నేను నిండుగా విరబూసిన పూలతో సొక్కి ఉన్నాను.
ఎంత దట్టంగా అంటే, ప్రపంచం కనుమరుగైపోయింది.
ఆ ఒక్క క్షణం నేనెలా గడిపేనో, గడిపేను.

అంతే! అంతవేడీ, అంత వెలుగూ ఒక్కసారి చల్లారిపోయాయి
నేను చలికి గడగడా వణికేను. నాకు ఇరుపక్కలా
సూర్యుడూ చంద్రుడూ చేష్టలుడిగిన దొంగల్లా పడున్నారు
నా చేతులు ఇపుడు ఆకులురాలి మోడువారిన కొమ్మలా ఉన్నాయి.

.

.

Burning Bush

.

One morning in eternity

I thought myself into a tree

I felt by breast push with the sheen

Of leaves expanding into green

I felt my arms like living wood

Thrill with resilience as I stood;

I felt the sap within my spine

Rise like the heart-blood of the spine.

Put off thy shoes (there was no sound)

And root thy feet in holy ground

I stripped my body to the breeze

The naked fellow of all trees

And stood again with arms outspread

My self almost untenanted.

Then, with a roar, there rose in me,

The flames of strange ecstasy.

My leaves my branches unconsumed,

With blossoms terrible I bloomed;

So tense, the whole world was obscured,

While, for a moment, I endured.

Then the fierce heat and brilliance died,

I shuddered cold. On either side

The Sun and Moon stared like dead thieves

My arms seemed naked of their leaves.

.

S Foster Damon ( Pseudonym: Samuel Nomad)

February 12, 1893 — December 25, 1971

American

Poem Courtesy:

Poetry Magazine, April 1924, pp 8-9

%d bloggers like this: