అనువాదలహరి

నూత్నసంవత్సరం… గేథే , జర్మను కవి

బ్లాగు మిత్రులకీ, శ్రేయోభిలాషులకీ, వారి కుటుంబాలకీ

నూతన ఆంగ్ల సంవత్సరం 2016

ఉజ్జ్వలమైన భవిష్యత్తుకి కొత్తమార్గాలు కొనిరావడమే గాక,

గతకాలపు సమస్యలకి

మంచిసమాధానాలు కూడా తీసుకురావాలని అభిలషిస్తున్నాను.

కాలం చేసిన గాయాలని కాలమే మాన్పుతుంది.

గత సంవత్సరంలో తగిలిన గాయాలు

ఈ సంవత్సరం జ్ఞాపకాలుగా మిగిల్చిపోవాలని ఆశిస్తున్నాను.

****

(1802 లో గేథే ఇంట్లో జరిగిన జరిగిన ఒక విందు ప్రేరణతో 1804లో వ్రాసిన కవిత)

ఓ విధీ!
కొత్తగా ప్రారంభించడానికీ
మరలిపోవడానికీ మధ్య
ఆనందంగా ఉండేలా అనుగ్రహించు.
తీయనైన జ్ఞాపకాలు
గుర్తు చేసుకోడానికీ
భవిష్యత్తుకీ మధ్య
చూస్తుండగానే ఆయువు తరిగిపోతుంది
వేదనల ఋతువులు
అవెప్పుడూ దుఃఖంలో
నిజాన్ని దూరంచేస్తాయి
ప్రేమా, ఆనందమూ ఎడబాటవుతాయి.

అపురూపమైన రోజులు
మళ్ళీ మమ్మల్ని ఏకం చేస్తాయి
అందమైన పాటలు మనసు తేలికచేసి
గుండె ధైర్యాన్ని ఇస్తాయి.
అలా కలుసుకున్న మేము
ప్రసన్నంగా ఆలోచిస్తాము
ఆ పారవశ్యంలో, విచారమూ
దుఃఖమూ చెల్లాచెదరౌతాయి.

ఆహ్! విధీ! నీ
కల్పన ఏంత వింతగా ఉంటుంది!
పాత బంధాలు పెనవేసుకుంటాయి
ప్రతిఫలం కొత్తగా దొరుకుతుంది
ఓ విధీ! నీకు కృతజ్ఞతలు.
గుడ్డిగా, స్థిమితంలేకుండా ఉండే మాకు
ప్రేమతో అనుగ్రహించేవాటన్నిటికీ
నీకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము. 
మార్పులో వేడుకలు
స్పష్టమైన ప్రేరణలు
నిష్కళంకమైన ప్రేమ
తృప్తిగా మనసు వెదజల్లే వెలుగు
నిన్నటివరకూ మా శరీరం
ముడుతలు దేరి
నిరాశలో విచారంలో మగ్గడం
అందరూ చూసి ఉంటారు
ఇప్పుడు మామీద
లీలగా ఒక నిజం వాలింది.
ఈ కొత్తదనం
మాకూ కొత్తే
ఒకరినొకరు విడలేని జంటగా
నృత్యం చేస్తూ ప్రక్కకి వాలినట్టు
ముందు కనుమరుగైపోయి
తర్వాత ప్రత్యక్షంఅయినట్లు
ఒకరిమీద ఒకరికున్న అపేక్ష
గహనమైన జీవితమూ
అస్పష్టమైన దారుల్లోంచి
కొత్తసంవత్సరం 1802 లోకి నడిపించుగాక !
.
జాన్ వుల్ఫ్ గాంగ్ వాన్ గేథే

28 August 1749 – 22 March 1832

జర్మను కవి

.

On The New Year

[Composed for a merry party that used to meet, in 1802, at Goethe’s house.]

FATE now allows us,

‘Twixt the departing

And the upstarting,

Happy to be;

And at the call of

Memory cherish’d,

Future and perish’d

Moments we see.

Seasons of anguish,–

Ah, they must ever

Truth from woe sever,

Love and joy part;

Days still more worthy

Soon will unite us,

Fairer songs light us,

Strength’ning the heart.

We, thus united,

Think of, with gladness,

Rapture and sadness,

Sorrow now flies.

Oh, how mysterious

Fortune’s direction!

Old the connection,

New-born the prize!

Thank, for this, Fortune,

Wavering blindly!

Thank all that kindly

Fate may bestow!

Revel in change’s

Impulses clearer,

Love far sincerer,

More heartfelt glow!

Over the old one,

Wrinkles collected,

Sad and dejected,

Others may view;

But, on us gently

Shineth a true one,

And to the new one

We, too, are new.

As a fond couple

‘Midst the dance veering,

First disappearing,

Then reappear,

So let affection

Guide thro’ life’s mazy

Pathways so hazy

Into the year!

1802.

.

Johann Wolfgang von Goethe

28 August 1749 – 22 March 1832

German Poet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: