నెల: జనవరి 2016
-
విశాలఖగోళం… జోసెఫ్ ఎడిసన్, ఇంగ్లీషు కవి
ఎంతో ఎత్తున వ్యాపించిన ఖగోళము తన దివ్యమైన నీలి ఆకాశంతో సహా, చుక్కలుపొదిగిన స్వర్గం, మెరిసే ఖచక్రం, వాటి ఆదిమత్వాన్ని చెప్పకనే చెబుతుంటాయి. అలసటలేని సూర్యుడు, ప్రతిరోజూ తనసృష్టికర్త శక్తిని ప్రకటిస్తాడు, సర్వశక్తిమయుడైన ఆ భగవంతుని సృష్టిని ప్రతి నేలమీదా చాటింపు వేస్తుంటాడు. ఇమతలో సాయం సంధ్య కమ్ముకుంటూంటే చంద్రుడు ఆ రసవత్తరమైన కథ అందుకుంటాడు ఆమె పుట్టుక పూర్వ వృత్తాంతాన్ని రాత్రంగా భూమికి వినిపిస్తాడు; తనచుట్టూ చుక్కలకాగడాలు మండుతుంటే; ఒక ధృవంనుండి మరొక ధృవానికి గ్రహాలన్నీ…
-
ప్రతి అందమైన వస్తువూ… మైకేలేంజెలో, ఇటాలియన్ కవి
ఏ అందమైన వస్తువైనా మనుషుల్లో నిష్కల్మషమూ, యోగ్యమూ ఐన కోర్కెలు రగులుస్తందంటే, అందానికి ఆటపట్టైన ఈ భూమ్యాకాశాల మధ్య, అది నా ప్రేయసి వంటిదై ఉండాలని నమ్ముతాను; ఎందుకంటే అంత అందమైన ఆమెలో, (ఆమె సమక్షంలో సర్వం మరిచిపోతాను), నాకు భగవంతుని అద్భుతమైన సృష్టినైపుణ్యం కనిపిస్తుంది, నాకు ఏ ఇతర వస్తువులగురించీ ధ్యాసే ఉండదు ఆమె ప్రేమలో మగ్నమై ఉన్నంతవరకు. అందులో వింతేమీ లేదు, ఎందుకంటే ఆ ప్రభావం తప్పించుకోడం నా వశంలో లేదు, ఆమె కనులు…
-
శిసుస్తవం… విలియం కాంటన్, ఇంగ్లీషు కవి
శిశుస్తవంగా నే చెప్పదలుచుకున్నదేమంటే దేముడు ముందు మనిషిని సృష్టించాడు, రెండోసారి అంతకంటే మెరుగుగా స్త్రీనీ, మూడోసారి అత్యుత్తమైనదీ సృష్టించేడు. అతని సృష్టిలో అన్నిటిలోకీ అందమైనవీ దివ్యత్వం తొణికిసలాడేదీ శిశువులే. ఇక్కడి ఏ వస్తువూ అంతకంటే ప్రియమైనదీ,సుందరమైనదీ కాదు. భగవంతుడు తన సృష్టి అంతా సంతృప్తిగా చూసినా శైశవాన్ని మించిన గులాబి పువ్వు మరొకటి లేదు. తర్వాత రోజుల్లో పిల్లలగురించి ఇలా చెప్పబడింది: వాళ్ళవంటివారికి తప్ప స్వర్గంలో ప్రవేశం లేదు. ఓ చిన్ని పాపాయీ! ముళ్ళు వికసించడం చూస్తున్న…
-
ఓహ్, అతని పేరు తలవకండి!… థామస్ మూర్, ఐరిష్ కవి
రాబర్ట్ ఎమ్మెట్ ఓహ్, అతనిపేరి తలవకండి! దాన్ని అలా నీడలోనే ఉండనీండి. గుర్తింపుకి నోచుకోక నిర్లక్ష్యంగా పడి ఉన్న అతని అవశేషాలతో పాటే; మనం మౌనంగా విషాదంతో విడిచే అశ్రువులు ఎవరికీ కనపడనీకండి, రాత్రి అతని తల వైపు సమాధి మీద రాలే మంచు బిందువులాగే. కానీ, రాత్రి పడిన ఆ మంచుబిందువు, మౌనంగా రోదించినా అతను శయనించినచోట పచ్చని పచ్చికకు తళతళలద్దుతుంది; మనం విడిచిన ఆ ఆశ్రుకణం రహస్యంగా దొర్లిపోవచ్చు, కానీ తన జ్ఞాపకాన్ని పదికాలాలపాటు…
-
Trying to Understand Gurudev’s Prayer
Into that heaven of freedom, my father, let the humanity awake! This is one of the most earnest appeals to God made by a human being. Gurudev Rabindranath Tagore, warm with love for his fellow beings, urges God to let this humanity awake into a heaven of freedom. Bertrand Russel’s said his longing…
-
భావనా పటిమ… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం ఒక పిచ్చివాడు, ఒక ప్రేమికుడు, ఒక కవీ ముగ్గురూ గాఢంగా, నిగూఢంగా ఆలోచించగలరు; నరకం పట్టగలిగినదానికంటే కూడా భూతాల్ని పిచ్చివాడు చూస్తే, ఒక ప్రేమికుడు అంత మైమరపుతోనూ ఒక ఈజిప్టు భామ కనుబొమల్లో హెలెన్ సౌందర్యాన్ని చూడగలడు; ఇక కవి కన్నులు, ఒక పూనకం వచ్చినట్టు ఆవేశంలో ఊగిపోతూ భూమ్యాకాశాలని అట్నించి ఇటూ ఇట్నించి అటూ పరీక్షిస్తూ గమనిస్తే, తనకి తెలియని ఆకారాలకి కవి కలం ఒక రూపాన్నిచ్చి,…
-
నా మనసు ఎగిరి గెంతులేస్తుంది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
ఆకాశంలో హరివిల్లు చూడగానే నా మనసు ఎగిరి గెంతులేస్తుంది; నేను పుట్టినపుడూ అలాగే ఉంది, నేను పెద్దవాణ్ణి అయేకా అదే తీరు, నేను ముసలివాణ్ణి అయినా అంతే, నేను చనిపోయిన తర్వాత కూడా! పసితనమే పెద్దరికాన్ని తీర్చిదిద్దుతుంది; రాబొయే రోజులు ఒకదాని వెంట ఒకటి అతి సహజంగా గడిచిపోవాలని భావిస్తున్నాను. . విలియం వర్డ్స్ వర్త్ (7 April 1770 – 23 April 1850) ఇంగ్లీషు కవి “My heart leaps up” . My…
-
పరబ్రహ్మ… రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, అమెరికను కవి
రౌద్ర సంహర్త తను చంపుతున్నాననుకున్నా హతుడు తను సంహరించబడుతున్నాననుకున్నా, వాళ్ళకి నేను ఎంత చతుర మార్గాలలో స్థితి, లయ, పునస్సృష్టి చేస్తానో తెలీదు. నాకు ప్రియమైన వారిని మరువను, దూరం చెయ్యను నాకు ఎండ అయినా, నీడ అయినా ఒక్కటే, మాయమైన దేవతలు నాకు తిరిగి కనిపిస్తారు నాకు కీర్తి అయినా అపకీర్తి అయినా ఒక్కటే. నన్ను విడిచిపెట్టువారు, కష్టాలు పడతారు నాతో విహరించేవారికి, నేను రెక్కలనౌతాను; సంశయమూ నేనే, సంశయాత్మకుడినీ నేనే బ్రాహ్మణుడు అనుష్ఠించే రుక్కునీ…
-
ప్రేమించకండి… కెరొలీన్ నార్టన్, ఇంగ్లీషు కవయిత్రి
ప్రేమించకండి, ప్రేమించకండి ఓ మట్టి బొమ్మల్లారా! ఆశల మనోహరమైన పూల సరులు మట్టితో చేసినవే, విరబూచి నిండా కొన్నిగంటలయినా గడవక ముందే అవి వాడి కళావిహీనమై రాలిపోడానికి పుట్టినవే ప్రేమించకండి! ప్రేమించకండి! మీరు ప్రేమించే వస్తువు మారిపోవచ్చు; గులాబివన్నె పెదవి మిముజూసి చిరునవ్వు నవ్వకపోవచ్చు, ఇంతవరకు కరుణగా చూసిన కళ్ళు ఇపుడు నిర్లిప్తంగా, వింతగా చూడొచ్చు, గుండె ప్రేమతో కొట్టుకోవచ్చు, కానీ అది నిజం కాకపోవచ్చు. ప్రేమించకండి! ప్రేమించకండి! మీరు ప్రేమించిన వ్యక్తి మరణించవచ్చు, ఆనందదాయకమూ, ఆహ్లాదకరమైన…
-
బెలిండా… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి
ఆమె తెల్లని గుండెమీద మెరిసే శిలువ ధరించి ఉంది దాన్ని ఆస్తికులు ముద్దాడితే, నాస్తికులు ఆరాధిస్తారు ఆమె అందమైన చూపులు ఆమె సూక్ష్మ బుద్ధిని సూచిస్తున్నాయి, చురుకైన కళ్ళలాగే, అంత నిలకడలేకుండానూ, ఎవరిమీదా ప్రత్యేకతలేకుండా, అందరికీ చిరునవ్వు చిందిస్తునాయి సూర్యుడంత ప్రకాశవంతంగా చూపరుల చూపులని ఆమె కళ్ళు తాకుతున్నాయి సూర్యుడిలాగే, అవి అందరిమీద ఒక్కలాగే ప్రకాశిస్తున్నాయి. అయినా, సరళతలో లాలిత్యం, గర్వపు పొడలేని మధురిమ ఉన్నాయి; అవి ఆమె లోపాలు కప్పిపుచ్చవచ్చు, కన్నియలు దాచడానికి లోపాలంటూ ఉంటే,…