“జీవితమా!ఓపిక పట్టు. ప్రేమ గుమ్మందగ్గర ఉన్నాడు. తను లోనికి వచ్చినపుడు, స్వాగతించి సుఖంగా కూచోనీ. పాపం ఎన్ని రోడ్లు తిరగవలసి వచ్చిందో ఆలోచించు. ఎంతకాలం అతను నిర్రిక్షించవలసి వచ్చిందో ఊహించు.”
“లాభం లేదు. ప్రేమని లోనికి రానిస్తే నాకు ఆలస్యం అయిపోతుంది. అతనికంటే ముందు మరొకడు వచ్చేడు. ఇపుడు ఖాళీ లేదు. నేను ఆ బంధం గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించేను. ప్రేమనే అవకాశం కోసం వేచి ఉండనీ. వస్తే కాల్చుకుతినెస్తాడు”
“జీవితమా! కాస్త తీరిక చేసుకుని ప్రేమని లోనికి రానీ. నీ అందమైన కేశాల్ని అతనికి అందివ్వు; తను చక్కగా ముడివేస్తాడు.”
“అసలు ప్రేమకే పనిలేక పాటలు పాడుకుంటూ పొద్దుపుచ్చుతున్నాడు. లాభంలేదు గానీ. ప్రేమని చివరగా రానీ. కడదాకా ఉంటాడులే.”
జీవితమా! భద్రం. ప్రేమ చివరివాడు కాదు. ప్రేమ ఎప్పుడో వెళిపోయాడు. ఇక మృత్యువుతో సరిపెట్టుకో. . వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్