గని కార్మికుడు… మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను
పైనున్న వాళ్ళందరూ నిన్నెరుగుదురని అంటారు;
వాళ్ళు చెప్పేది అబద్ధం.
నువ్వు నా తండ్రివి; నేను పనిచేసే నిశ్శబ్దం నా తల్లి;
ఒక్క కొడుక్కే తెలుసు తండ్రి సంగతి.
మనిద్దరం ఒక్కలాటి వాళ్ళమే నాన్నా!
మన అంతరంగాల్ని బహిర్గతం చెయ్యం,
జ్ఞానం మనల్ని ఒదిగి ఉండేలా చేస్తుంది.
బయటకి వెళితే
నేను కూడా నా సోదరులతో పాటే తాగి అరుస్తుంటాను-
తమ ఉనికికి కారకులైన తల్లిదండ్రుల్ని మరిచే చాలామంది పిల్లల్లా.
కానీ నువ్వు మళ్ళీ గట్టిగా ఒడిసి పట్టుకుంటావు;
మేము నీ నుండి దొంగిలించిన జీవనకోలాహలానికి మూల్యం చెల్లిస్తాము.
.
మేక్స్ వెల్ బోడెన్ హీం
May 26, 1892 – February 6, 1954
అమెరికను కవి
.
Image Courtesy: http://www.louisoder-verlag.de/louisoder-authors/autor-maxwell-bodenheim.jpg