అనువాదలహరి

అతను నిష్క్రమించాడు… డేవిడ్ హార్కిన్స్, సమకాలీన ఇంగ్లీషు కవి

క్రిస్టియన్ మిత్రులందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు.

***

క్రిందటి సంవత్సరం మనతో గడిపిన వ్యక్తులు ఈరోజు మనతో ఉండకపోవచ్చు. వాళ్ళను మరిచి మనం పండుగచేసుకుంటున్నామన్న బాధా, అసంతృప్తి కొందరిలో కనిపించవచ్చు. మరణించిన జ్ఞాపకాలు ఒక్కటే కాదు మనల్ని నడిపించవలసినది. వాళ్ళు ఆశించి అసంపూర్ణంగా విడిచిపెట్టిన పనులను వాళ్ళ గుర్తుగా మనం పూర్తిచెయ్యడమే వాళ్ళకి మనం ఇవ్వగలిగిన సరియైన నివాళి. “నలుగురు కూచుని నవ్వే వేళల నాపేరొకపరి తలవండి” అంటుంది గురజాడవారి పుత్తడి బొమ్మ “పూర్ణమ్మ” తమ అన్నదమ్ములతో.

జీవితం మన చేతుల్లో ఉంది… అంటే కాలం ఎటువంటి కష్టాలు తీసుకువచ్చినా, వాటికి సరిగా స్పందించగల నేర్పు మనలో ఉంటే, జీవితం సజావుగా సాగుతుంది. జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే, గతాన్ని, వ్యక్తుల్నీ అక్కడే వదిలేసి, దాని గుణపాథాల్నీ, వ్యతులపట్ల మనప్రేమనీ ముందుకు తీసుకుపోవాలి. దుఃఖమైనా, ఆనందమైనా మనకి బయటనుండి వచ్చేవి కావు. మనం ఎంపిక చేసుకునేవే. కేవలం మనకి జరిగేవి సంఘటనలు. వాటికి మనం ప్రతిస్పందించే తీరే మనకి జీవితంలో సుఖదుఃఖాలను కలుగజేస్తుంది.

అతను గతించేడని మీరు కన్నీరు కార్చవచ్చు,
లేదా అతనొకప్పుడు మీతో గడిపినందుకు ఆనందించవచ్చు,
మీరు కళ్ళు మూసుకుని అతను తిరిగిరావాలని ప్రార్థించవచ్చు,
లేదా, కళ్ళు తెరిచి అతను మీకు విడిచిపెట్టినదంతా చూడొచ్చు.

మీరతన్ని చూడలేరు గనుక మీ మనసు శూన్యమైపోవచ్చు,
లేదా మీ మనసంతా అతనితో పంచుకున్నప్రేమతో నిండిపోవచ్చు,
మీరు రేపటివంక చూడకుండా నిన్నలోనే బ్రతకొచ్చు
లేక, నిన్నటి కారణంగా రేపు హాయిగా గడపొచ్చు.

అతను శారీరకంగా మాత్రమే లేడని ఊహించి తలుచుకోవచ్చు,
లేక అతని జ్ఞాపకాలని పదిలపరచుకుని వాటితో జీవించవచ్చు,
మీ మనసు మూసేసి, రోదిస్తూ, వెన్ను త్రిప్పి అచేతనంగా ఉండిపోవచ్చు
లేక తన ఆశయాలు సాధనకి కళ్ళు విప్పి, నవ్వుతూ, ప్రేమతో పూనుకోవచ్చు.
.
డేవిడ్ హార్కిన్స్

సమకాలీన ఇంగ్లీషు కవి.

For a surprise read about the poet here

He Is Gone

.

He is Gone

You can shed tears that he is gone,
Or you can smile because he lived,
You can close your eyes and pray that he will come back,
Or you can open your eyes and see all that he has left.

Your heart can be empty because you can’t see him
Or you can be full of the love that you shared,
You can turn your back on tomorrow and live yesterday,
Or you can be happy for tomorrow because of yesterday.

You can remember him and only that he is gone
Or you can cherish his memory and let it live on,
You can cry and close your mind be empty and turn your
back,
Or you can do what he would want: smile, open your eyes,
love and go on.

David Harkins

Contemporary English Poet

(Note: There are other versions of the poem with She for He and corresponding changes in text, as also, the original poem told in first person with the Title “Remember Me)

%d bloggers like this: