ఒక పిల్ల పాడుకునే పాటలు… మేరీ కెరోలీన్ డేవీస్, అమెరికను కవయిత్రి I బహుశా దేముడు ఈడెన్ తోట వేస్తున్నప్పుడు పొరపాటున ఒక విత్తనం పక్కన కాలపు పొలంలో జారవిడిచి ఉంటాడు. అది గాని పెరిగిపెద్దదై ఈ క్షణంగా మారలేదుకదా? II నువ్వూ నేనూ ఒక సారి క్రింద పడ్ద జీవితాన్ని ఏరి దానివంక చిత్రంగా చూశాం మనకి దాన్ని ఆటవస్తువుగా ఉంచుకోవాలో, పారెయ్యాలో తెలీలేదు. ఎర్రని దీపావళి టపాకాయల్లా, చూడానికి చాలా బాగుంది, మనకి అది వెలిగించబడిందని కూడా తెలుసు. ఎందుకేనా మంచిదని రాయబారం ఇంకా కాలుతుండగానే దాన్ని క్రిందకి పడేశాము… III నేను కూడా త్వరలోనే మరణించబోతున్నాను. ఓ పువ్వా! నీకు అంత అహం పనికిరాదు. IV ఒంటరిగా సూర్యుడు మరణిస్తున్నాడు ఆ అఖాతంలోని ఒక ద్వీపంలో. కళ్ళుమూసుకొండి, పువ్వుల్లారా మీరు చాలా చిన్నవాళ్ళు మీరు మృత్యువుని చూడకూడదు. V సూర్యుడు ఒక వీరుడి శరీరంనుండి రాలే రక్తం బొట్టులా రాలిపోతున్నాడు. బాధల్ని ప్రేమించే మనం అది చూసి ఆనందిస్తున్నాం . మేరీ కెరోలీన్ డేవీస్ (1890- Unknown) అమెరికను . Songs of a Girl I Perhaps, God, planting Eden, Dropped, by mistake, a seed In Time’s neighbor-plot, That grew to be This hour? II You and I picked up Life and looked at it curiously; We did not know whether to keep it for a plaything or not. It was beautiful to see, like a red firecracker, And we knew, too, that it was lighted. We dropped it while the fuse was still burning … III I am going to die too, flower, in a little while— Do not be so proud. IV The sun is dying Alone On an island In the bay. Close your eyes, poppies— I would not have you see death. You are so young! V The sun falls Like a drop of blood From some hero. We, Who love pain, Delight in this.. . Mary Carolyn Davies (1890 – unknown) American The New Poetry: An Anthology. 1917. Harriet Monroe, ed. (1860–1936). http://www.bartleby.com/265/89.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిడిసెంబర్ 21, 2015