ఆక్వేరియం దగ్గర… మేక్స్ ఈస్ట్మన్,అమెరికను

(అక్వేరియం ప్రతీకగా తీసుకుని రాసిన మంచి కవిత. మనుషులు ఆక్వేరియంలోని చేపలను చూసి ఎందుకు నిరంతరం తిరుగుతున్నాయో అనుకుని ఆశ్చర్యంతో కూడిన జాలి ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ల చేష్టలు ఈ విశాలప్రపంచం అనే ఆక్వేరియంలో చేపల ప్రవృత్తికి భిన్నంగా ఏమీ ఉండదు.)

యుగాల వయసున్న ఆ సముద్రపులోతుల్లో
అవి అలసి పోయి, వంకీలు తిరుగుతూ…
పెదాలు బిగించి, పాలిపోయి, ఆశ్చర్యంప్రకటించేకళ్ళతో
ఆ ‘సివర్ ఫిష్ ‘ లు ప్రశాంతంగా ఈదుతున్నాయి.
వాటికి ఎక్కడికి వెళ్ళడానికి త్రోవ ఏదీ వేసిలేదు.
అవి నీళ్ళెటుపోతే అటుపోతాయి… ముందుకీ వెనక్కీ.
కనురెప్పలు వాల్చకుండా చూస్తుంటాయి
వాటికి సమతలంలో నిలబడి చూసే
సందర్శకులని నిర్లిప్తంగా, వింతగా చూస్తాయి.
ప్రజలు అక్కడ తొంగి తొంగి చూస్తుంటారు,
వాళ్ళూ ముందుకీ వెనక్కీ తిగితింటారు,
వాళ్ళకీ ఎక్కడికెళుతున్నారో, ఎందుకో తెలీదు
కానీ వాళ్ళ కళ్ళలోనూ ఆశ్చర్యం కనిపిస్తుంది
ఒక్కోసారి, పేలవమూ, నిర్లిప్తమైన ఆస్చర్యం.
.
మేక్స్ ఈస్ట్మన్

January 4, 1883 – March 25, 1969

అమెరికను

.

.

.

 At the Aquarium

.

Serene the silver fishes glide,

Stern-lipped, and pale, and wonder-eyed!

As through the aged deeps of ocean,

They glide with wan and wavy motion!

They have no pathway where they go,

They flow like water to and fro.

They watch with never winking eyes,

They watch with staring, cold surprise,

The level people in the air,

The people peering, peering there:

Who wander also to and fro,

And know not why or where they go,

Yet have a wonder in their eyes,

Sometimes a pale and cold surprise.

.

Max Eastman

January 4, 1883 – March 25, 1969

American Poet and Political activist

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/103.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: