రోజు: డిసెంబర్ 18, 2015
-
ఒక ముసలమ్మ పదచిత్రం… ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను
ఆమె అతికష్టం మీద కుంటుతూ నడుస్తోంది ఆగి, సంకోచిస్తూ, మళ్ళీ మెల్లిగా కదుల్తోంది కళావిహీనమైన ఆ ముఖంతో ప్రశ్నార్థకంగా చూస్తూ … కోరికలూ, బాధలూ, భయాలూ అన్నీ హరించుకుపోయి. సాగిపోయిన ముడుతల్లో పాలిపోయిన బుగ్గలు వేలాడుతున్నాయి అందులో రక్తం ప్రవహిస్తున్న జాడ ఎక్కడా కనిపించదు. వరికంకులు కట్టగట్టినట్టున్న ఆమె చేతులు మాసి, చిరుగుపాతైపోయిన శాలువాని పట్టుకున్నాయి రొమ్ము ఉండవలసినచోట ఎముకలు ముడుచుకుపోయి ఉన్నాయి ఆమె పిరుదులు ఒక ముడిలా అటూఇటూ కదులుతున్నాయి తాడులాంటి గొంతులోనుండి శ్వాశ అతికష్టం […]