లండన్… ఎఫ్. ఎస్. ఫ్లింట్, ఇంగ్లీషు కవి

ఓ నా అందమైన లండను నగరమా!
ఆ సూర్యాస్తమయమో,
తెల్లని ఎత్తైన ఆ ‘బర్చి’ చెట్టు
ఆకుల పరదాలోంచి లీలగా మెరుస్తున్న
ఆకాశమో,
ఇక్కడి ప్రశాంతతో,
లే పచ్చికమీద కువకువలాడుతూ
గంతులేస్తున్న
పిట్టలగుంపో,
అన్ని వస్తువులమీదా సన్నగా పరుచుకుని
వాటిని కనుమరుగుచేస్తున్న చీకటో … కాదు
నా మనసు దోచుకుంటున్నది.

చంద్రబింబం అలా
మహావృక్షాల శిరసులమీంచి ఆకసానికి ప్రాకుతుంటే
ఆ నక్షత్రాల గుంపులో
ఆమెను* ఊహించుకుంటాను
వెళుతూ వెళుతూ
ఆ చంద్రబింబం మనుషులమీద
ప్రసరించే కాంతిని ఊహించుకుంటాను.

నా అందమైన లండను నగరమా!
వెన్నెల తళుకులద్దుతున్న
చిటారుకొమ్మలకు
ఎగబ్రాకుతాను
అక్కడ గాలితరగల చల్లదనానికి
నా మనసు చల్లబడుతుందేమోనని.

(*గమనిక: ఇంగ్లీషు సాహిత్యంలో చంద్రుడు పురుషుడు కాదు… స్త్రీ.)
.
ఎఫ్. ఎస్. ఫ్లింట్

19 December 1885 – 28 February 1960

ఇంగ్లీషు కవి

London!

(From: Poems in Unrhymed Cadence)

 

I

London, my beautiful,  

It is not the sunset        

Nor the pale green sky  

Shimmering through the curtain      

Of the silver birch,        

Nor the quietness;

It is not the hopping     

Of the little birds 

Upon the lawn,   

Nor the darkness 

Stealing over all things 

That moves me.   

But as the moon creeps slowly        

Over the tree-tops

Among the stars, 

I think of her       

And the glow her passing       

Sheds on men.     

London, my beautiful,  

I will climb 

Into the branches 

To the moonlit tree-tops,        

That my blood may be cooled

By the wind.

.

F. S. Flint

19 December 1885 – 28 February 1960

English Poet and Translator

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/116.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: