కురితీర్ తో లియాడేన్… మోరీన్ ఫాక్స్, ఐరిష్ కవయిత్రి

(జానపద గాథ: లియాడేన్, కురితీర్ ఇద్దరూ 7 వశతాబ్దికి చెందిన ఐరిష్ కవులు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కురితీర్  పెళ్ళిప్రయత్నాలు చేసుకుంటూ కొంతకాలం కనబడపోయేసరికి, లియాడెన్ ఏవో తెలియరాని కారణాలకి సన్యాసినిగా దీక్షతీసుకుంటుంది. అది తెలుసుకున్న కురితీర్ నిరాశకు లోనై తనుకూడా సన్యాసిగా దీక్షతీసుకుంటాడు. మొదట్లో వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకోడానికే పరిమితమైనా కొన్నాళ్ళకి వాళ్ళ దీక్షభగ్నం అవుతుంది. అపుడు కురితీర్ తన ఆత్మను రక్షించుకుందికీ, శేషజీవితాన్ని ప్రాయశ్చిత్తంతో గడపడానికీ ఆమెని విడిచిపెడతాడు)

I

నాకే గనక ప్రేమ ఎంత సంకుచితమైన చెరసాలో తెలిసుంటే
ఓ కురితీర్, నా దుఃఖ హేతువా! కేవలం ఒక ముద్దుకి ప్రతిగా
విశాలమైన గగనతలాన్ని నీకు సమర్పించేదాన్ని కాను.

ప్రేమ ఎంత నిప్పచ్చరమో తెలిసుంటే, నేను ఒక రొట్టె కోసం
నా ధనాన్నీ, పొలాల్నీ, తోటల్నీ ఇచ్చేసి ఉండే దాన్ని;
ఇప్పుడు నా ఆత్మకోసం ఈ భూమ్యాకాశాల్ని పోగొట్టుకున్నాను.

నాకే గనక ప్రేమయొక్క శక్తి తెలిసుంటే, అతన్ని ఆపడానికి
నేను ఈ విశ్వపు కోటీరపంక్తుల్ని అగ్నికి ఆహుతి చేసేదాన్ని :
మృత్యువుని మించిన దైవాన్ని ఎవరినైనా ప్రార్థించేదాన్ని.

II

విశాలమైన కెరటం ఒడ్డుకి నిర్లిప్తంగా తోసుకొచ్చినట్టు
దేనికీ చలించకపోవడానికి అలవాటు పడ్డ … నేను
చివరకి నిర్దాక్షిణ్యమైన ప్రేమ శిలలకి వికలమైపోయాను

నా చూపుకి పురుషుల ముఖాల్లో కళతప్పడం చూసిన నేను
నీ ఒక్క చూపులకి ఒక గడ్డిపరకలా చలించిపోయాను
నీ స్పర్శకి నా జీవం బానిసై, నా మనసు వశం తప్పింది.

నీ ప్రేమనుండి దూరమవవలసి వస్తే సూర్యచంద్రుల్ని మసి చేస్తాను
నిన్ను నా వైపు తెచ్చుకుందికి ఈ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తాను,
ఓ బాధాతప్తమైన ప్రేమా! మృత్యువు ప్రశాంతత నిస్తుందా?

III

ఇక ఎవరినీ నిందించను. రాత్రింబవళ్ళు నా నుదిటిని
స్పృశించే చల్లని మట్టినుండీ, శీతల ధరణినుండీ విముక్తనయ్యాను
తడబడే అడుగులతో నేనిపుడు సూర్యమండలం చేరుకున్నాను.

నేనిపుడు అందరి సమక్షంలోనూ నిల్చున్నాను. అందరికీ తెలియనీ
(నేనే స్వయంగా నిన్ను కీర్తిస్తాను, వాళ్ళ మాటలు ఋజువు చేస్తూ)
నా నుండి దూరంగా వెళ్ళిపోవడంలో నీ వివేకం ఎంతగొప్పదో.

ఇంతకీ, మధువు తాగినవాడెవడైనా అడుగున మడ్డి ఉంచుకుంటాడా?
మనిషిని వధించిన వాడు ప్రతీకారం తీర్చుకునేదాకా నిరీక్షిస్తాడా?
కోరిక తీరిన తర్వాత స్త్రీకి ఏ పురుషుడైనా అండగా నిలబడతాడా?

కురితీర్! శెలవు. నీ ఆత్మ సురక్షితంగా ఉండుగాక!
నాకు నీ కంటే ప్రేమాస్పదమైన వస్తువు కనిపించలేదు.
భగవంతుని దృష్టిలో అదే అమూల్యమేమో? ఎవరు చెప్పగలరు?

నా ఆత్మ భగవంతునికి ఎందుకూ పనికిమాలిన వస్తువు,
ఓ కురితీర్, అది నీకు నా ప్రేమకంటే కూడా కనికిష్టం,
దాన్ని తక్కువ చేసి నేను నీ పాదాల చెంత విసిరేశాను.

IV

దైవత్వం కాని శక్తి ఏదైనా ఈ ధరణికి ఉంటే
నేను చనిపోకుండా నా జ్ఞాపకశక్తిని హరించమని.

నన్ను కురితీర్ ప్రేమించిన రోజులున్నై. అది ఇప్పుడు గతం.
ఆ ప్రేమని నా నుండి దూరం చేసుకున్నది నేనే. చేజేతులా నేనే.
లేకపోతే, నాకు మతి తప్పించి దేముడే వేళాకోళం చేసి ఉంటాడు.

దైవాతీతమైన శక్తి కనుక ఈ నేలకి ఉంటే
అతని దృష్టిలో నేను మళ్ళీ పడకుండా రక్షించమని ప్రార్థిస్తాను.

V

అన్నీ సమసిపోయాయి … చివరికి దుఃఖంకూడా నశించింది
పండుటాకు రాలినట్టు నాలోంచి మనోవికారాలు కూడా తొలగిపోయాయి.
ఇప్పుడు నా చెంత కురితీర్ ఉన్నా నాకూ ఏమీ అనిపించదు:
అతను పక్కనుండి పోతుంటే నా తలకూడా తిప్పను.
నా శరీరంలో మనసు ఇపుడు రాయిలా ఉంది.
ఇంతకాలం పట్టుకున్నది చేతిలోంచి జారవిడుచుకుంటాను.

.

మోరీన్ ఫాక్స్

1883-1972

ఐరిష్ కవయిత్రి

Liadain to Curithir

.

(Liadain and Curithir were two poets who lived in Ireland in the seventh century. They fell in love, but while Curithir was absent making preparations for their marriage, Liadain, for some unexplained reason, took the vows of a nun. Curithir in despair became a monk. At first they continued to see each other, but when this led to the breaking of their vows, Curithir left Liadain to spend his life in penance and thus save his soul.)

I

IF I had known how narrow a prison is love,

Never would I have given the width of the skies

In return for thy kiss, O Curithir, thou my grief!

If I had known love’s poverty, I would have given

Dúns and forests and ploughlands and begged my bread:

For now I have lost the earth and the stars and my soul.

If I had known the strength of love, I would have laid

The ridge of the world in ashes to stay his feet:

I would have cried on a stronger lord—on Death.

II

I, that was wont to pass by all unmoved

As the long ridge of the tide sweeps to the shore,

Am broken at last on the crags of a pitiless love.

I, who was wont to see men pale at my glance,

Like the quivering grass am shaken beneath thine eyes;

At thy touch my spirit is captive, my will is lost.

I would darken the sun and moon to break from thy love,

I would shatter the world to win thee again to my side.

O aching madness of love! Have the dead repose?

Or wilt thou tear my heart in the close-shut grave?

III

I have done with blame, I have risen from the cold earth

Where night and day my forehead has known the clay.

With faltering steps I have passed out to the sun.

Now in the sight of all I stand, that all may know

(For I myself will praise thee and prove their words)

How great was thy wisdom in turning away from me.

Who that has drunken wine will keep the lees?

Who that has slain a man will wait for revenge?

Who that has had his desire of a woman will stay?

Farewell, O Curithir, let thy soul be saved!

I have not found a thing that is dearer to thee.

In the eyes of God is it priceless? Who can say!

My soul is a thing of little worth unto God:

Of less worth unto thee, O Curithir, than my love.

And unto me so small I flung it beneath thy feet.

IV

If the dark earth hold a Power that is not God

I pray It to bind up memory lest I die.

There was a day when Curithir loved me, now it is gone.

It was I that sundered his love from me, I myself;

Or it was God who struck me with madness and mocked.

If the dark earth hold a Power that is not God

I pray It to hide me for ever away from His face.

V

All things are outworn now—grief is dead,

And passion has fallen from me like a withered leaf.

Little it were to me now though Curithir were beside me:

Though he should pass I would not turn my head.

My heart is like a stone in my body.

All I have grasped I loose again from my hands.

Moireen Fox

1883-1972

Irish Poetess

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/117.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: