(ఒక్క జార్ చక్రవర్తి పదాతి దళంలోనే సుమారు 2.5 లక్షలమంది యూదులు … ఒక పత్రికలో వార్త)
వాళ్ళు నాకు సైనికుడి దుస్తులు తొడిగేరు
చేతిలో తుపాకీ పెట్టి
ఈ పరాయిదేశంలో నాకు నచ్చినవాణ్ణి
ధైర్యంగా చంపమని వాళ్ళు నన్ను పంపేరు
పాపం, చాలా మంది తమదేశంకోసం మరణిస్తారు
చాలామంది విశాల భూభాగాన్ని గెలవడానికి మరణిస్తారు
కాని నేను నా బిడ్డను హతమార్చిన
నా జన్మభూమికోసం ప్రాణాలర్పిస్తాను.
ఎన్ని వందలసంవత్సరాలబట్టి
దేశాలు పుట్టి, అభివృద్ధిచెంది, మాయమవడంలేదు!
శాంతి మంత్రాన్ని ప్రదర్శిస్తూ నశించమని
మా కులదేవతలు మమ్మల్ని శపించలేదుగదా?
కాలం మమ్మల్ని గేలిచేసి మాతో ఆడుకుంటోంది!
కానీ, నేను ఎందుకు ఊరికే మధనపడాలి?
ఒక యూదుని వాళ్ళు శిలువకి రక్తంకారేలా వేలాడదీసేరు
ఏమయింది? అతను మాత్రం సాధించిందేమిటి?
.
ఫ్లారెన్సు కైపర్ ఫ్రాంక్
(1885- June 27, 1976)
అమెరికను కవయిత్రి
స్పందించండి