నాచుపట్టినట్టున్న ఒక శిలని
నా అరచేతిలోకి తీసుకున్నాను …
దానిమీద ఒక్కొక్క మరక ఎర్రని-బంగారం రంగులో ఉంది
దిగంబరంగా ఉన్న ఈ కొలొరాడో కొండల మధ్య
హోరుమంటూ గాలి చేస్తున్న శబ్దాన్ని
కళ్ళుమూసుకుని వింటున్నాను.
నా చుట్టూ మంఛు ఒత్తుగా పరుచుకుని ఉంది.
బూడిదరంగులో ఏనాటివో
బాగా ఎదిగిన ఈ దేవదారు చెట్లు
ఎండిపోయి, బోసిగా
చిక్కుపడ్డ జూత్తులోంచి సాంబ్రాణిపొగలా
వాటిమధ్య వీస్తున్న గాలితోపాటు గుర్రుమంటున్నాయి;
తెల్లని రెక్కలతో గర్వంగా
మహారాణిగారి ఠీవితో, దర్పంతో
తెల్లగా మెరుస్తూ, చల్లగా, నిశ్శబ్దంగా
ఒక మేఘ శకలం
నా మీదనుండి కదలిపోతుంది
గాలి రోదిస్తుంది.
పక్కన గంబీరమైన లోయలోంచి ఉబుకుతూ
వడిగా జారుతున్న సెలయేటి రొద నాకు వినవస్తుంది.
.
హామ్లిన్ గార్లాండ్
September 14, 1860 – March 4, 1940
అమెరికను

Image Courtesy: Wikipedia
స్పందించండి