ఇద్దరం ఇరుక్కుని కూచున్నప్పటికీ
అతను జోకు వెయ్యడం మానలేదు,
అందువల్ల మరొక కొత్తజోకు వెయ్యడానికి
ప్రయత్నించినపుడు పగలబడి నవ్వుతుండగా
ప్రమాదవశాత్తూ అతని తల
బయటకి కనిపించింది.
అతను జోకు వేస్తుండగానే తుపాకీ పేలింది…
దేముడికెరుక… మిగతాది ఎపుడు వింటానో!
.
విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్
2.10.1878- 26.5. 1962
ఇంగ్లీషు కవి