బ్రాడ్వే… హెర్మన్ హేగ్డార్న్, అమెరికను కవి

(Note: బ్రాడ్వే న్యూయార్క్ లో ప్రసిద్ధిపొందిన సినిమాహాళ్ళకీ, నాటకశాలలకీ, రెస్టారెంట్లకీ నెలవైన ఒక వీధి.)

.

ఈ పేరులేని ముఖాలు చుక్కల్లా ఎలా ఉన్నాయో…

లెక్కనేనన్ని మడుతున్న నిప్పుకణికలివి!

విహాయస వీధిలో పేలవంగా నడిచే నక్షత్రాల ఊరేగింపు

ఈ ఆత్మల పాలపుంత!

ఒక్కొక్కటీ స్వయంప్రకాశమైన ఒక నీహారిక

ఓహ్, ప్రభూ! ప్రతి వదనమూ ఒక ప్రపంచం!

ఆరుబయట సడిలేని చీకటిలోకి నా చూపు సారిస్తాను:

ఆ దూర తారలలో, ఏ ఉద్యానాలు, ఏ భవంతులున్నాయో,

ఏ మానవ జిగీష తన ఆనందానికి వాటిని నిర్మించిందో,

ఏ అఖాతాలు, ఏ అడ్డుగోడలున్నాయో!

ఆత్మలు తిరిగే ఏ విశాల ప్రాసాదాలున్నాయో!

అది ఏ స్వర్గమో! లేక ఏ నరకమో!

.

హెర్మన్ హేగ్డార్న్

18 July 1882 – 27 July 1964

అమెరికను కవి

.

Broadway

.

How like the stars are these white, nameless faces—

  These far innumerable burning coals!

This pale procession out of stellar spaces,

  This Milky Way of souls!

Each in its own bright nebulæ enfurled,

Each face, dear God, a world!

I fling my gaze out through the silent night:

  In those far stars, what gardens, what high halls,

Has mortal yearning built for its delight,

  What chasms and what walls?

What quiet mansions where a soul may dwell?

What heaven and what hell?

.

Hermann Hagedorn

18 July 1882 – 27 July 1964

American Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/149.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: