అనువాదలహరి

సానెట్- 100 షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం

ఎక్కడున్నావు కవితా, చాలరోజులయింది మమ్మల్ని మరిచావా?

నీకు ఈ శక్తి అంతా ఎక్కడనుండి వస్తుందో వివరించవా?

నీ ఆవేశాన్ని అర్హతలేనివాటికి వినియోగిస్తున్నావా?

హీనమైన వస్తువు ప్రచారానికి నీ శక్తిని ధారపోస్తున్నావా?

ఓ మతిభ్రమించిన కవితా! నీ కీర్తి పునరుద్ధరించుకో

కాలాన్ని నిష్ప్రయోజనంగా దుర్వినియోగంచేసిన అపవాదునుండి;

ఏదీ, నీ గౌరవం ఇనుమడింపజేసే గీతాల్ని ఇంపుగా ఆలపించు

నీ కలానికి పదునునీ, వివేకాన్ని తిరిగి ప్రసాదించు.

లే! తీసుకున్న విశ్రాంతి చాలు! నా ప్రేమిక వదనాన్ని పరికించు

అక్కడ కాలం వృద్ధాప్యచాయలు అద్దుతోందేమో గమనించు,

అలాచేసి ఉంటే, నిర్దాక్షిణ్యంగా పరిహరించు; అంతేకాదు,

కాలం చేసిన వికృతచేష్టని సర్వత్రా అందరూ గర్హించేలా చెయ్యి.

కాలం జీవితాన్ని హరించేగతికి మిన్నగా నా ప్రేమికకు కీర్తినివ్వు

దాని పదునునీ, వంకరలనీ నీ శక్తి అధిగమించుగాక!
.
విలియం షేక్స్పియర్

ఇంగ్లీషు కవి

William Shakespeare

.

Sonnet 100

.

Where art thou Muse that thou forget’st so long,
To speak of that which gives thee all thy might?
Spend’st thou thy fury on some worthless song,
Darkening thy power to lend base subjects light?
Return forgetful Muse, and straight redeem,
In gentle numbers time so idly spent;
Sing to the ear that doth thy lays esteem
And gives thy pen both skill and argument.
Rise, resty Muse, my love’s sweet face survey,
If Time have any wrinkle graven there;
If any, be a satire to decay,
And make time’s spoils despised every where.
Give my love fame faster than Time wastes life,
So thou prevent’st his scythe and crooked knife.

.

Shakespeare

Sonnet Courtesy:

http://www.shakespeares-sonnets.com/

%d bloggers like this: