అనువాదలహరి

ప్రేమికులు… హొరేస్ హోలీ, అమెరికను

కవిత శీర్షికనుబట్టి పైపైకి చూస్తే అది స్త్రీ పురుషుల మధ్య ప్రేమని సూచిస్తున్నట్టు ఉన్నా, అది మనిషికి భగవంతునితో ఉండే అనుబంధాన్ని సూచించే ఆధ్యాత్మిక భావనలున్న కవిత. “ఈ సృష్టికి మూలకారకుడైన భగవంతుడు ఒక్కడే అనీ, అన్ని మతాలూ ఆ మూలపురుషుడినుండే వచ్చేయనీ, జాతులూ, సంస్కృతులలో ఎంత వైవిధ్యము ఉన్నప్పటికీ మానవాళి అంతా ఒక్కటే అనీ చెప్పే “బహాయి మతానికి” గత శతాబ్దంలో విస్తృతంగా సేవచేసిన వ్యక్తి.

మనం భగవంతుణ్ణి వర్ణించడానికి చెప్పే మాటలన్నీ అతన్ని వర్ణించలేక పేలవంగా తేలిపోతాయి. భగవంతుని మూర్తిమత్వం మనల్ని నడిపించినపుడు మనం దాని ప్రభావానికి లోనుకాకుండానూ, దాని ఆకర్షణ చట్రంలో తిరగకుండా ఉండలేమనీ దీని తాత్పర్యం.

***

ఎన్ని చెప్పు, ఎంత ఆపుకోలేని ఆనందంలో చెప్పినా
మగాడి మెప్పులూ, అపవాదులూ చివరకి డొల్లగా తేలిపోతాయి;
అవి గాలిలోకి వదిలిన మాటల్లా
వ్యాపిస్తూ వాటి ఉరవడిలోనే కొట్టుకుపోతాయి;
అంత అద్భుతమైన “మూర్తి” నడిపించినపుడు
మన ఆలోచనలు దానిని అనుసరించక తప్పవు;
అంత ఆవేశము మనల్ని ప్రేరేపించినపుడు
మన మనసు పూర్తిగా వివశంకాక తప్పదు.
.
హొరేస్ హోలీ
April 7, 1887 – July 12, 1960
అమెరికను.

Lovers

 .

Whate’er our joy compelled, men’s praise and blame fall hollow,

A voice upon the winds that drown it as they blow:

So fair a vision led, our thought was all to follow;

So strong a passion urged, our will was all to go.

.

Horace Holley

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/159.html

%d bloggers like this: