అనువాదలహరి

మృత్యుముఖంలోంచి బయటికొచ్చిన తర్వాత… హెలెన్ హోయట్, అమెరికను కవయిత్రి

మృత్యుముఖంలోంచి బయటికొచ్చినదగ్గరనుండి,
దాని భీకరత్వాన్ని, భయాన్నీ చూసి ఉండడం చేత
జీవితం ఇప్పుడు నాకు ప్రాణప్రదం అయింది
అది లేకపోవడం అంటే ఏమిటో గ్రహించడం చేత!
ఇప్పుడు బాధలు బాధించవు,చింతల చింత లేదు,
అన్నీ పోగొట్టుకోవడమంటే ఏమిటో తెలిసేక.

నేను మృత్యుముఖంలోంచి బయటికొచ్చిన దగ్గరనుండీ
మృత్యువు నిత్యమూ నన్నంటి తిరుగుతున్న కొద్దీ
ఓహ్, ఏమి చెప్పను! ప్రపంచం చాలా విశాలమయింది
మృత్యువును దగ్గరగా చూసిననాటినుండి!
నా సమయం ఇప్పుడు చాలా అపురూపమైనది
ఎందుకంటే కాలం నిలిచిపోవడమంటే ఏమిటో తెలిసు గనుక

నేను మృత్యుముఖంలోంచి బయటికి వచ్చిన తర్వాత
నాకు ఆ కాళ రాత్రి అనుభవం అయిన తర్వాత
నా మనసంతా వెలుగుతో నిండిపోయింది
నాకు మృత్యువు అవగతం అయింది కనుక.
ఆహా ఏమా చీకటి! నా కళ్ళు తెరిపించింది.
ఏమా మృత్యువు! నా జీవితం నాకు ప్రసాదించింది.
.
హెలెన్ హోయట్

January 22, 1887 – August 2, 1972

అమెరికను కవయిత్రి

Since I Have Felt the Sense of Death…

Since I have felt the sense of death,
Since I have borne its dread, its fear—
Oh, how my life has grown more dear
Since I have felt the sense of death!
Sorrows are good, and cares are small,
Since I have known the loss of all.

Since I have felt the sense of death,
And death forever at my side—
Oh, how the world has opened wide
Since I have felt the sense of death!
My hours are jewels that I spend,
For I have seen the hours end.

Since I have felt the sense of death,
Since I have looked on that black night—
My inmost brain is fierce with light
Since I have felt the sense of death.
O dark, that made my eyes to see!
O death, that gave my life to me!

.
Helen Hoyt
January 22, 1887 – August 2, 1972
American Poet
The New Poetry: An Anthology.  1917.
Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/164.html

 

%d bloggers like this: