అనువాదలహరి

అకస్మాత్ చీకటి… షార్మెల్ ఐరిస్, ఇటాలియన్- అమెరికను కవి

అలసిపోయిన ‘రోజు ‘ పడమటి కొండవాలులో జోగుతోంది

పాపం! ఆ శ్రామికుడు నిద్రావస్థకి అంచుల్లో తేలిపోతున్నాడు.

సూర్యుడనే రైతు, అస్తమయమనే గానుగవద్ద,

ఎర్రగా తనరంగులో సారాయిని పిండుకుంటున్నాడు.

ఆహ్! సంధ్యా తరంగిణులమీద జాల్వారుతున్న పసిడిచాయ

గంజాయి మొక్క తన కెంజాయవన్నె కలల భాండాగారం తెరుస్తోంది

చంద్రుడనే కొడవలితో ‘రాత్రి’  గోధుమపంట కోసి

తన పాదాలచెంత నక్షత్రాల పనలు మోపుచేస్తోంది.

ఎగిరి ఎగిరి అలసిన పక్షులారా! ఓ మనసా! సేదదీరండి.

ఈ పచ్చని మైదానమనే వాగులో ఎక్కడా చలనం లేదు.

మీ  మీ ప్రియసఖుల గుండెలమీద ఆత్మలారా! నిద్రించండి.

దైవం మీకు మనశ్శాంతి అనుగ్రహించుగాక! నిద్రలో రక్షించుగాక!

.

షార్మెల్ ఐరిస్

(1889–1967)

ఇటాలియన్- అమెరికను కవి

Early Nightfall

The pale day drowses on the western steep;

The toiler faints along the marge of sleep

Within the sunset-press, incarnadine,

The sun, a peasant, tramples out his wine.

Ah, scattered gold rests on the twilight streams;

The poppy opes her scarlet purse of dreams.

Night with the sickle-moon engarners wheat,

And binds the sheaves of stars beneath her feet.

Rest, weary heart, and every flight-worn bird!

The brooklet of the meadow lies unstirred.

Sleep, every soul, against a comrade breast!

God grant you peace, and guard you in your rest!

.

Scharmel Iris

1889-1967

Italian-American Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/169.html

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: