అనువాదలహరి

సంభాషణ… వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్, అమెరికను

“జీవితమా!ఓపిక పట్టు. ప్రేమ గుమ్మందగ్గర ఉన్నాడు.
తను లోనికి వచ్చినపుడు, స్వాగతించి సుఖంగా కూచోనీ.
పాపం ఎన్ని రోడ్లు తిరగవలసి వచ్చిందో ఆలోచించు.
ఎంతకాలం అతను నిర్రిక్షించవలసి వచ్చిందో ఊహించు.”

“లాభం లేదు. ప్రేమని లోనికి రానిస్తే నాకు ఆలస్యం అయిపోతుంది.
అతనికంటే ముందు మరొకడు వచ్చేడు. ఇపుడు ఖాళీ లేదు.
నేను ఆ బంధం గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించేను.
ప్రేమనే అవకాశం కోసం వేచి ఉండనీ. వస్తే కాల్చుకుతినెస్తాడు” 

“జీవితమా! కాస్త తీరిక చేసుకుని ప్రేమని లోనికి రానీ.
నీ అందమైన కేశాల్ని అతనికి అందివ్వు; తను చక్కగా ముడివేస్తాడు.”

“అసలు ప్రేమకే పనిలేక పాటలు పాడుకుంటూ పొద్దుపుచ్చుతున్నాడు.
లాభంలేదు గానీ. ప్రేమని చివరగా రానీ. కడదాకా ఉంటాడులే.”

జీవితమా! భద్రం. ప్రేమ చివరివాడు కాదు.
ప్రేమ ఎప్పుడో వెళిపోయాడు. ఇక మృత్యువుతో సరిపెట్టుకో.
.
వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్

April 4, 1878 – January 29, 1954

అమెరికను

.

Dialogue

.

Be patient, Life, when Love is at the gate,

And when he enters let him be at home.

Think of the roads that he has had to roam.

Think of the years that he has had to wait.

But if I let Love in I shall be late.

Another has come first—there is no room.

And I am thoughtful of the endless loom—

Let Love be patient, the importunate.

O Life, be idle and let Love come in,

And give thy dreamy hair that Love may spin.

But Love himself is idle with his song.

Let Love come last, and then may Love last long.

Be patient, Life, for Love is not the last.

Be patient now with Death, for Love has passed.

.

Walter Conrad Arensberg

April 4, 1878 – January 29, 1954

American Art Collector, Critic and Poet.

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/18.html

గని కార్మికుడు… మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను

పైనున్న వాళ్ళందరూ నిన్నెరుగుదురని అంటారు;

వాళ్ళు చెప్పేది అబద్ధం.

నువ్వు నా తండ్రివి; నేను పనిచేసే నిశ్శబ్దం నా తల్లి;

ఒక్క కొడుక్కే తెలుసు తండ్రి సంగతి.

మనిద్దరం ఒక్కలాటి వాళ్ళమే నాన్నా!

మన అంతరంగాల్ని బహిర్గతం చెయ్యం,

జ్ఞానం మనల్ని ఒదిగి ఉండేలా చేస్తుంది.

బయటకి వెళితే

నేను కూడా నా సోదరులతో పాటే తాగి అరుస్తుంటాను-

తమ ఉనికికి కారకులైన తల్లిదండ్రుల్ని మరిచే చాలామంది పిల్లల్లా.

కానీ నువ్వు మళ్ళీ గట్టిగా ఒడిసి పట్టుకుంటావు;

మేము నీ నుండి దొంగిలించిన జీవనకోలాహలానికి మూల్యం చెల్లిస్తాము.

.

మేక్స్ వెల్ బోడెన్ హీం

May 26, 1892 – February 6, 1954

అమెరికను కవి

.

 Image Courtesy: http://www.louisoder-verlag.de/louisoder-authors/autor-maxwell-bodenheim.jpg

 

.

The Miner

.

Those on the top say they know you, Earth—they are liars.

You are my father, and the silence I work in is my mother.

Only the son knows his father.

We are alike—sweaty, inarticulate of soul, bending under thick knowledge.

I drink and shout with my brothers when above you—

Like most children we soon forget the parents of our souls.

But you avidly grip us again—we pay for the little noise of life we steal.

.

Maxwell Bodenheim

May 26, 1892 – February 6, 1954

American Poet and Novelist.

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/28.html

అరుణోదయం… గార్డన్ బాటమ్లీ, ఇంగ్లీషు కవి

ముక్కున కరుచుకున్న నత్తగుల్లని

ఒక రాయికేసి బాదుతోందొక పక్షి;

విరగకాసిన చెట్టుకొమ్మనుండి ఒక పిట్ట

కొమ్మ విరిగిపోతుందేమో అనిపించేట్టు వేలాడుతోంది;

ప్రభాతగీతాలింకా ప్రారంభం కాలేదు,

కానీ ఆ విశాలమైన చెట్టు ఆవరణ చీకటిలో

ఎగురుతూ, పులుగులన్నీ కిచకిచలాడసాగేయి.

ఎందుకంటే, ఒక గుడ్లగూబ ఇప్పుడే తనగూడు చేరుకుంది.

.

గార్డన్ బాటమ్లీ

20 February 1874 – 1948

ఇంగ్లీషు కవి

Dawn

.

A Thrush is tapping a stone

With a snail-shell in its beak;

A small bird hangs from a cherry

Until the stern shall break.

No waking song has begun,

And yet birds chatter and hurry

And throng in the elm’s gloom

Because an owl goes home.

.

(From: Night and Morning Songs)

Gordon Bottomley

20 February 1874 – 1948

English Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/33.html

సైనికుడు… రూపర్ట్ బ్రూక్, ఇంగ్లీషు కవి

నేను మరణించడం జరిగితే, నా గురించి ఇలా తలపోయండి:

ఎక్కడో దేశంకాని దేశంలో ఓ మూల ఒకింత జాగా ఉంటుంది

అది ఎప్పుడూ ఇంగ్లండునే తలపోస్తుంది. అక్కడ ఆ

అపురూపమైన నేలలో అంతకంటే విలువైన మట్టి దాగుంది.

ఆ మట్టి ఇంగ్లండులో పుట్టి, రూపుదిద్దుకుని, జ్ఞానం సంపాదించింది,

ఇంగ్లండు ఒకప్పుడు ప్రేమించడానికి పూలనీ, తిరగడానికి త్రోవల్నీ ఇచ్చింది,

అది ఇంగ్లండులో ఒక భాగం, అది అన్నిరకాలుగా ఇంగ్లండునే ప్రతిఫలిస్తుంది,

అక్కడి నదుల్లో ములిగి, అదృష్టం కొద్దీ అక్కడి సూర్యుడి వెలుగుని అనుభవించింది.

భగవంతుని కల్పనలో ఒక క్షణికమైన ఊహ, ఇంగ్లండు

ఇచ్చిన ఆలోచనలనే ఏదో మేరకు తిరిగి ప్రతిబింబిస్తుంది;

అక్కడి ప్రకృతిసౌందర్యాలూ, ఆమె నిశ్చింతగా కన్న కలలూ;

మిత్రుల నుండి నేర్చుకున్న అకళంకమైన హాసమూ, సౌమ్యత,

ఇంగ్లండు ఆకాశంక్రింద అక్కడ ఆ గుండెలో పదిలంగా ఉండేవని.

.

రూపర్ట్ బ్రూక్

3 August 1887 – 23 April 1915

ఇంగ్లీషు కవి

.

.

The Soldier

 .

IF I should die, think only this of me:

  That there’s some corner of a foreign field

That is for ever England. There shall be

  In that rich earth a richer dust concealed;

A dust whom England bore, shaped, made aware,

  Gave, once, her flowers to love, her ways to roam,

A body of England’s, breathing English air,

  Washed by the rivers, blest by suns of home.

And think, this heart, all evil shed away,

  A pulse in the eternal mind, no less

Gives somewhere back the thoughts by England given;

  Her sights and sounds; dreams happy as her day;

And laughter, learnt of friends; and gentleness,

  In hearts at peace, under an English heaven.

.

Rupert Brooke

3 August 1887 – 23 April 1915

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/40.html

శరణార్థులు … గ్రేస్ హజార్డ్ కాంక్లింగ్, అమెరికను కవయిత్రి

బెల్జియం -1914

.

“అమ్మా! చంద్రుడు బూరుగుచెట్లుదాటి పోతున్నాడు
రోడ్డు ఎంతకీ తరగదు, తెల్లగా కనుచూపుమేరా,
మనం ఊరు ఇంతత్వరగా చేరలేమేమో,
చెప్పవూ, ఇంతకీ మనమెక్కడున్నామో?”

“నాన్నా, కన్నా, కాస్త ఓపికపట్టరా తండ్రీ,
మళ్ళీ మనకి త్రోవ కనిపిస్తుందిలే,
(భగవంతుడా! ఎవ్వరూ నడవని త్రోవ చూపించు
దేవుడా ! ఏమనిషికంటాపడకుండా రక్షణ కల్పించు!”)

“అమ్మా! నాకు నువ్వు చెప్పనే లేదు,
నన్నుతొందరగా ఎందుకు లాక్కొచ్చావో!
నేను సైనికులు పక్కనుండి వెళ్ళడం చూశాను
నాకు కాసేపు నిలబడితే బాగుణ్ణనిపించింది.”

“హుష్! గట్టిగా మాటాడకు! సైనికులు
పాడినట్టే, నేనూ పాడతాను నా చాతనైనంతవరకు…
వాళ్ళకి ప్రతివిషయానికీ ఒక పాట ఉంటుంది
వినరా, నా చిట్టితండ్రీ!

“ఇది సైనికులు కవాతుచేస్తూ పాడే పాట:
మనం ఈ వీధిలో పాడుకుండాము…”
“అలాగే, కానీ ఈ రోడ్డు చాలా పొడుగ్గా ఉంది
రాళ్ళు పొడుచుకొచ్చి నా కాళ్ళు పుళ్ళయిపోయాయి.”

“లేదురా, నా చిన్ని తెరువరీ, లే, పద
అదిగో వచ్చేసేము, ఆ కనిపిస్తున్నదే ఊరు.
నేను ముందుకీ వెనక్కీ సైనికులు
ఎలా కవాతు చేస్తారో చూపిస్తాను.”

“వాళ్ళు కవాతు చేస్తూ, పాడుతూ ముందుకిపోతారు
వాళ్ళకి దుమ్మూ, రాయీరప్పా గురించి చింతలేదు,
వాళ్లు వెళ్తుంటారు (దేవుడా! వాళ్ళనుండి నన్ను రక్షించు!)
ముందుకి, వాళ్ళు వెళ్ళకతప్పదు మరి.”

“అమ్మా! నాకు నిద్దరొస్తోంది.”
“లేదురా నాన్నా! ఇంద ఈ రొట్టెముక్క తిను.
హే భగవాన్! నన్ను కరువుతీరా ఏడవనీ!
లేదా, పగిలిపోయిన నా పాదాలని సరిచెయ్యి!”
.
గ్రేస్ హజార్డ్ కాంక్లింగ్

February 7, 1878 – November 15, 1958

అమెరికను కవయిత్రి

.

Refugees

Belgium—1914

 .

“Mother, the poplars cross the moon;

  The road runs on, so white and far,

We shall not reach the city soon:

  Oh, tell me where we are!”

“Have patience, patience, little son,

  And we shall find the way again:

(God show me the untraveled one!

  God give me rest from men!)”

“Mother, you did not tell me why

  You hurried so to come away.

I saw big soldiers riding by;

  I should have liked to stay.”

“Hush, little man, and I will sing

  Just like a soldier, if I can—

They have a song for everything.

  Listen, my little man!

“This is the soldiers’ marching song:

  We’ll play this is the village street—”

“Yes, but this road is very long,

  And stones have hurt my feet.”

“Nay, little pilgrim, up with you!

  And yonder field shall be the town.

I’ll show you how the soldiers do

  Who travel up and down.

“They march and sing and march again,

  Not minding all the stones and dust:

They go, (God grant me rest from men!)

  Forward, because they must.”

Mother, I want to go to sleep.”

  “No, darling! Here is bread to eat!

(O God, if thou couldst let me weep,

  Or heal my broken feet!)”

.

Grace Hazard Conkling

February 7, 1878 – November 15, 1958

American Poetess

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

అతను నిష్క్రమించాడు… డేవిడ్ హార్కిన్స్, సమకాలీన ఇంగ్లీషు కవి

క్రిస్టియన్ మిత్రులందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు.

***

క్రిందటి సంవత్సరం మనతో గడిపిన వ్యక్తులు ఈరోజు మనతో ఉండకపోవచ్చు. వాళ్ళను మరిచి మనం పండుగచేసుకుంటున్నామన్న బాధా, అసంతృప్తి కొందరిలో కనిపించవచ్చు. మరణించిన జ్ఞాపకాలు ఒక్కటే కాదు మనల్ని నడిపించవలసినది. వాళ్ళు ఆశించి అసంపూర్ణంగా విడిచిపెట్టిన పనులను వాళ్ళ గుర్తుగా మనం పూర్తిచెయ్యడమే వాళ్ళకి మనం ఇవ్వగలిగిన సరియైన నివాళి. “నలుగురు కూచుని నవ్వే వేళల నాపేరొకపరి తలవండి” అంటుంది గురజాడవారి పుత్తడి బొమ్మ “పూర్ణమ్మ” తమ అన్నదమ్ములతో.

జీవితం మన చేతుల్లో ఉంది… అంటే కాలం ఎటువంటి కష్టాలు తీసుకువచ్చినా, వాటికి సరిగా స్పందించగల నేర్పు మనలో ఉంటే, జీవితం సజావుగా సాగుతుంది. జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే, గతాన్ని, వ్యక్తుల్నీ అక్కడే వదిలేసి, దాని గుణపాథాల్నీ, వ్యతులపట్ల మనప్రేమనీ ముందుకు తీసుకుపోవాలి. దుఃఖమైనా, ఆనందమైనా మనకి బయటనుండి వచ్చేవి కావు. మనం ఎంపిక చేసుకునేవే. కేవలం మనకి జరిగేవి సంఘటనలు. వాటికి మనం ప్రతిస్పందించే తీరే మనకి జీవితంలో సుఖదుఃఖాలను కలుగజేస్తుంది.

అతను గతించేడని మీరు కన్నీరు కార్చవచ్చు,
లేదా అతనొకప్పుడు మీతో గడిపినందుకు ఆనందించవచ్చు,
మీరు కళ్ళు మూసుకుని అతను తిరిగిరావాలని ప్రార్థించవచ్చు,
లేదా, కళ్ళు తెరిచి అతను మీకు విడిచిపెట్టినదంతా చూడొచ్చు.

మీరతన్ని చూడలేరు గనుక మీ మనసు శూన్యమైపోవచ్చు,
లేదా మీ మనసంతా అతనితో పంచుకున్నప్రేమతో నిండిపోవచ్చు,
మీరు రేపటివంక చూడకుండా నిన్నలోనే బ్రతకొచ్చు
లేక, నిన్నటి కారణంగా రేపు హాయిగా గడపొచ్చు.

అతను శారీరకంగా మాత్రమే లేడని ఊహించి తలుచుకోవచ్చు,
లేక అతని జ్ఞాపకాలని పదిలపరచుకుని వాటితో జీవించవచ్చు,
మీ మనసు మూసేసి, రోదిస్తూ, వెన్ను త్రిప్పి అచేతనంగా ఉండిపోవచ్చు
లేక తన ఆశయాలు సాధనకి కళ్ళు విప్పి, నవ్వుతూ, ప్రేమతో పూనుకోవచ్చు.
.
డేవిడ్ హార్కిన్స్

సమకాలీన ఇంగ్లీషు కవి.

For a surprise read about the poet here

He Is Gone

.

He is Gone

You can shed tears that he is gone,
Or you can smile because he lived,
You can close your eyes and pray that he will come back,
Or you can open your eyes and see all that he has left.

Your heart can be empty because you can’t see him
Or you can be full of the love that you shared,
You can turn your back on tomorrow and live yesterday,
Or you can be happy for tomorrow because of yesterday.

You can remember him and only that he is gone
Or you can cherish his memory and let it live on,
You can cry and close your mind be empty and turn your
back,
Or you can do what he would want: smile, open your eyes,
love and go on.

David Harkins

Contemporary English Poet

(Note: There are other versions of the poem with She for He and corresponding changes in text, as also, the original poem told in first person with the Title “Remember Me)

నను చివరిసారిగా ప్రేమించు… ఏలిస్ కార్బిన్, అమెరికను

కడసారి నను ప్రేమించు, ఇష్టం లేదా, విడిచిపెట్టు;
కటువైన మాటలు, ఈ సగం సగం మాటల్లా, నన్ను బాధించవు;
చివరగా చెబుతున్నా, అయితే నన్ను ప్రేమించు, లేదా విడిచిపెట్టు.

కడసారిగా నను ప్రేమించు, లేకుంటే నువ్వు చెప్పిన
ఆఖరిమాటే చివరి మాట కానీ;
నను ప్రేమించు లేదా విడిచిపెట్టు…
ఒక ఎగిరే పక్షిలా, మబ్బుతునకలా, ఆవిరిలా…

కడసారిగా నను ప్రేమించు…
నేనిపుడు శిలపై జాల్వారుతున్న జలని.
.
ఏలిస్ కార్బిన్

April 16, 1881 – July 18, 1949

అమెరికను కవయిత్రి

.

Love Me at Last

 .

Love me at last, or if you will not,

    Leave me;

Hard words could never, as these half-words,

    Grieve me:

Love me at last—or leave me.

Love me at last, or let the last word uttered

    Be but your own;

Love me, or leave me—as a cloud, a vapor,

    Or a bird flown.

Love me at last—I am but sliding water

    Over a stone.

.

Alice Corbin (Henderson)

April 16, 1881 – July 18, 1949

American Poet, author and Editor

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/61.html

ఒంటరి మరణం… ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి

చలిలో నేను బయటకు వస్తాను; నేను
చల్లటినీటిలోనే స్నానం చేస్తాను;
నేను వణుకుతూ, పశ్చాత్తాపపడతాను;
ఒంటరిగా ప్రభాతవేళ నా నుదిటికీ,
కాళ్ళకీ, చేతులకీ విభూతిపూసుకుంటాను;
వెలుతురు రాకుండా కిటికీలు మూసెస్తాను
పొడవాటి నాలుగు కొవ్వొత్తిల్నీ
వాటి ఒరల్లో నిలిపి వెలిగిస్తాను;
తూరుపు తెల్లవారుతుంటే,
నేను పక్కమీద శరీరాన్ని వాల్చి
మొహమ్మీదకి ముసుగులాక్కుంటాను.
.
ఎడిలేడ్ క్రాప్సీ

September 9, 1878 – October 8, 1914

అమెరికను కవయిత్రి

.

Adelaide Crapsey

September 9, 1878 – October 8, 1914

.

The Lonely Death

.

In the cold I will rise, I will bathe

In waters of ice; myself

Will shiver, and shrive myself,

Alone in the dawn, and anoint

Forehead and feet and hands;

I will shutter the windows from light,

I will place in their sockets the four

Tall candles and set them a-flame

In the grey of the dawn; and myself

Will lay myself straight in my bed,

And draw the sheet under my chin.

.

Adelaide Crapsey

September 9, 1878 – October 8, 1914

American

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/80.html

మడుగు… హిల్డా డూలిటిల్, అమెరికను

ఇంకా బ్రతికే ఉన్నావా?
నేను నిన్ను తాకుతానో లేదో
సముద్రంలో చేపలా అల్లల్లాడిపోతావు.
నిన్ను నా వలతో రక్షిస్తాను.
అందమైన చారలున్నదానా? ఇంతకీ నువ్వెవరు?
.
హిల్డా డూలిటిల్
September 10, 1886 – September 27, 1961
అమెరికను

The Pool
.

Are you alive?
I touch you—
You quiver like a sea-fish.
I cover you with my net.
What are you, banded one?
.
H. D.
September 10, 1886 – September 27, 1961
American
The New Poetry: An Anthology. 1917.
Harriet Monroe, ed. (1860–1936).
http://www.bartleby.com/265/83.html

%d bloggers like this: