అనువాదలహరి

అడవి పాట… హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి

నా తల వాల్చడానికి చోటు లేదు
నా గుండెలమీద ఏ శిశువూ పడుక్కోదు
నా కోసం ఏ పెళ్ళి విందూ ఇవ్వబడదు
నేనీ నింగి కింద ఒంటరిగా నడవాల్సిందే.

నా అధికారం డబ్బూ త్యజించాను
కొండంత ఎత్తు బరువు దించుకుని తేలికపడ్డాను!
పగలంతా ఈ రాళ్ళగుట్టలమీద నడిచి
చీకటివేళకి పొయ్యి వెలిగించుకుంటాను.

వడగళ్ళకి కొండంతా విరగబూస్తుంది
శీతగాలి నా కన్నీరు తుడుస్తుంది
నేను బలహీనను, అయినా, మృగశిర నాభయాలు
పోగొట్టినపుడు, నేను బలం పుంజుకుంటాను.

వేకువ దుప్పటి తొలగించి
గోరుగిల్లుచంద్రుడితో నిద్రలేస్తాను.
సమవర్తి తండ్రి సమదృష్టితో చూసి
నా చెయ్యిపట్టుకుని నడిపిస్తాడు .

పడమటిదిక్కున మంటల రెక్కలు వ్యపిస్తున్నాయి.
నాకు దొరుకుతుందా? అసలు నాకు తెలుస్తుందా?
నా కాళ్ళు అన్వేషణకి కంకణం కట్టుకున్నాయి—
రెండు అనంతాలు విడదీసే దిగంతరేఖ వైపుకి
.
హారియట్ మన్రో
23 December 1860- Sept 26 1936
అమెరికను కవయిత్రి

.

.

Mountain Song

.

I have not where to lay my head:
Upon my breast no child shall lie;
For me no marriage feast is spread:
I walk alone under the sky.

My staff and scrip I cast away—
Light-burdened to the mountain height!
Climbing the rocky steep by day,
Kindling my fire against the night.

The bitter hail shall flower the peak,
The icy wind shall dry my tears.
Strong shall I be, who am but weak,
When bright Orion spears my fears.

Under the horned moon I shall rise
Up-swinging on the scarf of dawn.
The sun, searching with level eyes,
Shall take my hand and lead me on.

Wide flaming pinions veil the West—
Ah, shall I find? and shall I know?
My feet are bound upon the Quest—
Over the Great Divide I go.
.
Harriet Monroe
December 23, 1860 – September 26, 1936
American poet and Editor 

http://www.bartleby.com/265/260.html

%d bloggers like this: