అనువాదలహరి

ఆకాశంలో పరుగులాడి… జేమ్స్ ఓపెన్ హీం, అమెరికను కవి

నక్షత్రాల పయ్యెద రెపరెపలాడుతూ…

సూర్యుడూ, భూమీ ఆమె హృదయ కుసుమం మీద

భ్రమరాల్లా తారాడుతూ…

గహన రోదసి కుహరాల్లో వీచే గాలులపై పాదాలు తేలియాడుతూ…

ఎవ్వరామె అలా ఆకాశంలో పరుగిడుతున్నది?

ఆమె కన్నులు నీహారికలవలె అస్పష్టముగా ఉన్నవి.

చీకటిలో దూరాననున్న తన ప్రియునకై ఆత్రపడుతున్నది కాబోలు.

.

జేమ్స్ ఓపెన్ హీం

1882–1932

అమెరికను కవి

Runner in the Skies

.

Who is the runner in the skies,

With her blowing scarf of stars,

And our earth and sun hovering like bees about her blossoming heart!

Her feet are on the winds where space is deep;

Her eyes are nebulous and veiled;

She hurries through the night to a far lover.

.

James Oppenheim

1882- 1932

American Poet

%d bloggers like this: