కొరదా సూచనలు… ఎజ్రా పౌండ్, అమెరికను కవి
ఓ నా కవితలారా! రండి, మనిషి బలహీనతలు బయటపెడదాం
భవిషత్తు గురించి చింతలేని, స్థిరమైన ఉద్యోగం ఉన్న మనిషంటే మనకున్న అసూయ వెళ్ళగక్కుదాం.
నా కవితలారా! మీకు చాలా బద్ధకస్తులు.
ఇలా అయితే మీ జీవితం దారుణంగా ముగుస్తుంది.
మీరు రోడ్లంబట తిరుగుతారు, సందుమలుపుల్లోనూ, బస్సు స్టాపుల్లోనూ పచార్లు చేస్తారు,
మీరు ఊరికే పనీపాటా లేకుండా ఉన్నారు.
కనీసం మీరు మనిషి అంతరాంతరాలలోని ఉదాత్తతనైనా బయటపెట్టరు.
మీకు చివరి రోజులు మరీ దుర్భరంగా గడవడం ఖాయం.
నా సంగతొ అడుగుతున్నారా? నేనిప్పటికే సగం పిచ్చెక్కి ఉన్నాను.
నేను మీతో ఎంతగా వాగి వాగి ఉన్నానంటే నా చుట్టూ మీరే కనిపిస్తున్నారు.
కొవ్వెక్కి బలిసిన పశువులు. దిగంబరులు! మీకు సిగ్గు లేదు.
కానీ, ఇదిగో, అన్నిటిలోకీ కొత్త కవితా!
నీకు బాగా పెంకితనం చెయ్యడానికి అట్టే వయసు రాలేదు.
నేను చైనా నుండి సర్పచిహ్నాలు అల్లిన
ఆకుపచ్చకోటు ఒకటి కొనితెస్తానులే.
ఈటలీ నుండి శాంతా మేరియా చర్చి లో బాలయేసు విగ్రహానికి తొడిగే
ఎర్రని పట్టు పంట్లాలు తీసుకొస్తానులే.
లేకపోతే మనకి మంచి అభిరుచులు లేవనుకుంటారు
మన వంశంలో ఏ కోశానా ఆ జాడలు లేవంటారు.
.
ఎజ్రా పౌండ్
30 October 1885 – 1 November 1972
అమెరికను కవి.
