అనువాదలహరి

పూర్ణ జీవనం… కేథరీన్ డేవిస్ చాప్మన్ (టిల్మన్), అమెరికను కవయిత్రి

జీవితం పరిపూర్ణంగా జీవించడమంటే
మానసికంగా ఎంతో బలం కలిగి ఉండి
ఉదాత్తమైన విషయాలను గ్రహించగల నేర్పు కలిగి
అందుకోవాలన్న ఆకాంక్ష, శ్రమ, కృషి, ప్రయత్నం చెయ్యడం.
లౌల్యాలనుండి మచ్చలేకుండా బయటపడడం.
భూనభోంతరాళంలో దైవం రచించిన మంచి గుర్తించి
మన పాత్రని … ఎంతచిన్నదైనా … సవ్యంగా నిర్వర్తించి
ఆ తర్వాత హాయిగా నిష్క్రమించడం.

ఆ మరణం ఎలాంటిదంటే హేమంతపు
చలికి, కురిసిన మంచుకి నిర్జీవంగా పడున్న భూమి
అనంతామృతధారలు వర్షించే విధి వసంత సృజనకి
మునపటికంటే అందంగా పునర్జీవించడం;
అటువంటి గాలి శ్వాసించి, అటువంటి రోజులు జీవించడం
అన్ని జీవులకీ అత్యంత యోగ్యమైనది.
ఇటువంటి జీవితమే ఉదాత్తమైనది
అటువంటి జన్మమే పరిపూర్ణమూ, మధురమూను.
.
కేథరీన్ డేవిస్ చాప్మన్ ( టిల్మన్)

(19th Feb 1870 – ?)

అమెరికను కవయిత్రి

(దురదృష్టవశాత్తూ ఈ కవయిత్రి జీవితం గురించి సరియైన సమాచారం నాకు దొరకలేదు)

.

To Will, To Do…

.

To will, to do, to work, to strive
To be supremely strong,
To highest things to be alive
And turn unscathed from wrong;
To love the good that God has made
In earth and air and sky,
To do while here our little part,
And after that to die.

Such death as comes to Mother Earth
By Winter’s frost and snow,
And then in Heaven’s eternal Spring
More beautiful to grow;
Such air to breath, such days to live,
Are for all souls most meet.
This, then, were highest life to live,
And life most full and sweet

.

Katherine Davis (Chapman) Tillman

19th Feb 1870 – ?

American Poetess.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: