మా అమ్మ నాకు అప్పుడే మంచుతో తడిసిన గులాబులతో మాలకట్టేది
చాలా సార్లు ఆ తోట ఎక్కెడ ఉందా ఎక్కడ ఉందా అని ఎంతో వెతికేను
ఏ చెట్టుకి మా ఆమ్మ కోసిన ఆ పువ్వులు పూచేయో
ఎంతప్రయత్నించినా కనుక్కోలేకపోయాను.
ఓ పిల్లా! కనుక్కోవాలని ప్రయత్నించకు
మీ అమ్మ పూలుకోసే పూలచెట్టు ఆచూకీ.
మా అమ్మ నాకు ఎప్పుడు ఉదాత్తమైన కథలు చెప్పేది;
ఎవరూ గమనించనపుడు ఆ పుస్తకం చూడాలనిపించేది;
కానీ, ఏం లాభం ఏ పేజీనుండి మా అమ్మ
ఆ కథలు చదివిచెబుతోందో తెలుసుకోలేకపోయాను.
ఓ బిడ్డా! తెలుసుకోవాలని ప్రయత్నించకు
ఏ పేజీనుండి మీ అమ్మ ఆ కథలు చదివి చెబుతోందో.
మా అమ్మ నాకు మంద్రస్వరంలో తియ్యని పాటలు పాడి వినిపించేది
తెల్లని వెన్నెల పరుచుకుని, పిల్లతెమ్మెర వీస్తున్నప్పుడు
కానీ తెల్లారిన తర్వాత ఎన్నడూ
మా అమ్మ పాటలు వినలేకపోయాను.
ఓ పాపా! ప్రయత్నించకు వేకువఝామున
మీ అమ్మ పాడిన పాటలు మరోసారి విందామని
.
ఫ్రాన్సిస్ (వెల్స్) షా
1872 – 1937
అమెరికను కవయిత్రి
.
.
The Child’s Quest
My mother twines me roses wet with dew;
Oft have I sought the garden through and through;
I cannot find the tree whereon
My mother’s roses grew.
Seek not, O child, the tree whereon
Thy mother’s roses grew.
My mother tells me tales of noble deeds;
Oft have I sought her book when no one heeds;
I cannot find the page, alas,
From which my mother reads.
Seek not, O child, to find the page
From which thy mother reads.
My mother croons me songs all soft and low,
Through the white night where little breezes blow;