అనువాదలహరి

థామస్ బైల్ పబ్ లో అన్నది… జేమ్స్ స్టీఫెన్స్, ఐరిష్ కవి

ఇంతచమత్కారవంతమూ, రసవత్తరమూ ఐన కవిత ఈ మధ్యకాలంలో నేను చదవలేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మనిషి తనమనుగడకి ఎంతటి ముప్పుతెచ్చుకుంటున్నాడో చాలా సరళంగా, సునిశితంగా చెప్పాడు కవి.

***

నేను దేవుణ్ణి చూశాను. నీకేమైనా సందేహమా?
అసలు అనుమానించడానికి నీకెంత గుండె ధైర్యం?
ఓయ్, నేను నిజంగా దేవుణ్ణి చూశాను. తనచెయ్యి
ఒక పర్వతాగ్రాన ఆంచి ఉంది. అతను ఒక సారి
ఈ ప్రపంచాన్ని, దాని పరిసరాల్నీ పరిశీలించాడు.
నువ్వు నన్ను చూస్తున్న దానికంటే స్పష్టంగా అతన్ని చూసేను.
నువ్వు అనుమానించకూడదు.

అతని ముఖంలో ఎక్కడా సంతృప్తి జాడ లేదు.
అతని కళ్ళల్లో అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఎక్కడో ఈ ప్రపంచపు చివరి వంపు వెనకనుంచి
కనిపించకుండా వీస్తున్న పిల్ల తెమ్మెరకి అతని గడ్డం ఊగుతోంది.
అతని నుదిటిమీద భయంకరమైన వెలుగు కనవచ్చింది.
అతను పెద్దగా ఒక నిట్టూర్పు విడిచి,”ఆ చుక్క మొదటినుండీ అంతే.
ఎప్పుడూ చెప్పిన త్రోవన నడవక నిరుత్సాహ పరుస్తుంది,” అన్నాడు.

తను చెయ్యి ఎత్తాడు. నిజం చెప్పాలంటే ఆ చెయ్యిని
గిరగిరా తిరుగుతున్న భూమ్మిదకి భయంకరంగా విదిలించాడు అనాలి.
అప్పుడు నేనన్నాను,”ఓరి దేముడోయ్! ఆగు. దాన్ని నువ్వు తాకరాదు.
నేను నీకు అడ్డంగా నిలబడుతున్నాను.
నేను నిలబడ్డచోటునుండి ఎప్పటికీ కదలమన్నా కదలను.”
అతనన్నాడు: “బిడ్డా! నువ్వింకా బ్రతికే ఉన్నావా?
చచ్చిపోయావనుకున్నానే!” అని చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.

.

జేమ్స్ స్టీఫెన్స్

9 February 1880 – 26 December 1950

ఐరిష్ కవి

 .

James Stephens

.

What Tomas An Buile said in a Pub

.

I saw God. Do you doubt it?

Do you dare to doubt it?

I saw the Almighty Man. His hand

Was resting on a mountain, and

He looked upon the World and all about it:

I saw Him plainer than you see me now,

You mustn’t doubt it.

He was not satisfied;

His look was all dissatisfied.

His beard swung on a wind far out of sight

Behind the world’s curve, and there was light

Most fearful from His forehead, and He sighed,

“That star went always wrong, and from the start

I was dissatisfied.”

He lifted up His hand—

I say He heaved a dreadful hand

Over the spinning Earth, then I said: “Stay—

You must not strike it, God; I’m in the way;

And I will never move from where I stand.”

He said, “Dear child, I feared that you were dead,”

And stayed His hand.

.

James Stephens

9 February 1880 – 26 December 1950

Irish Poet

The New Poetry: An Anthology.  1917.

 Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/343.html

%d bloggers like this: