చెట్టుమీదనున్న ఓ పిట్టా!
నువ్వు పాడగలిగినప్పుడే పాడు
రెక్కలు బారజాపుకుని ఆకాశంలో
ఎంతో ఎత్తుకి ఎగురుతూ ఆనందంగా ఉన్నా
చీకటిపడే వేళకి చల్లదనం ఉధృతమౌతుంది
కనుక, పాడగలిగినపుడే పాడు.
నిన్ను కబళించే ఉద్దేశ్యంతో
నీ మీదకి … రెక్కలు చాచి ఎగురుతూ
గద్ద ఒకటి వాలుగా తేలియాడుతూ అనుసరిస్తోంది
కనుక కమ్మని నీ గీతం త్వరలో చరమగీతం కాబోతోంది
ఈ రోజునీ, నిన్నూ, బాధోపహతుడనైన నన్నూ
ఆ నీలి రెక్కలు కప్పి కనుమరుగు చేస్తాయి.
అక్కడ ఏ పక్షిపాట గాని, జ్ఞాపకంగాని మిగలవు:
కనుక, పాడగలిగిన ఓపికున్నప్పుడే పాడు.
.
జేమ్స్ స్టీఫెన్స్