అనువాదలహరి

మరచిన జాతీయ చిహ్నం… వచేల్ లింజీ అమెరికను కవి

(జాన్ పి. ఆల్ట్ గెల్డ్ (30 డిశంబరు 1847- మార్చి 12 1902) స్మృతిలో)

Read about John P Altgeld here

మరుగుపడ్డ జాతి చిహ్నమా… ఆ రాతి క్రింద ప్రశాంతంగా నిద్రించు…
కాలం ఇక తనపని చూసుకుంటుంది… మట్టి నీ సంగతి చూసుకునేట్టుగానే.

“హమ్మయ్య, అతన్ని కప్పెట్టాం’ అనుకుంటున్నారు నీ శత్రువులు, లోన సంతసిస్తూనే
వాళ్ళ విచాఆన్ని సమర్థవంతంగా నటించేరు, ద్వేషాన్ని ప్రకటించకుండా  
వాళ్ళు నీ మీద గుర్రు మన్నారు, దూషించేరు, తిట్టిదిగపోశారు ప్రతిరోజూ
ఇవేళ నువ్వు మరణించడంతో, నిన్ను పొగిడి… పక్కనబెట్టారు.

నీగురించి ఇతరులు మౌనంగానో, భయంతోనో, నిజంగానో విచారించేరు
తినడనికి రొట్టెదొరకని వితంతువూ, యవ్వనంకరువైన కుర్రాడూ
ఎగతాళికి, చీదరానికీ గురైనవారూ, బాధితులూ, నిస్సహాయులూ, పేదలూ …
నిన్ను గుర్తుపెట్టుకోవలసినవాళ్ళంతా… ఇక నిన్ను గుర్తుపెట్టుకోరు.

నిన్ను అభిమానించినవారేరీ? ఇక ఏ పేరుపెట్టి పిలుస్తారు
నీ శవం మీద వందలు వందలుగా వాలి శోకించిన వాళ్ళు?
వాళ్లు కొన్ని వందలమంది వీరుల పేర్లని స్మరిస్తారు…
మరో వంద జాతీయ చిహ్నాలు ఎగురుతాయి నీ పిల్లల పిల్లలై…
వాటి రెక్కలలోని శక్తి నువ్వు కలగన్న కలల శక్తే
మానవజాతి సేవలో అలసిన నీ ఆత్మ స్థైర్యమే!

మరుగుపడ్డ జాతి చిహ్నమా… ఆ రాతి క్రింద ప్రశాంతంగా నిద్రించు…
కాలం ఇక తనపని చూసుకుంటుంది… మట్టి నీ సంగతి చూసుకునేట్టుగానే.
నిద్రించు, ఓ ధైర్యశాలీ! మేధావీ! జ్ఞానజ్యోతి రగిలించినవాడా!
ఏదో పేరులో బ్రతకడం కంటే జాతిస్మృతిలో జీవించడమే గొప్ప!
ఏదో పేరులో బ్రతకడం కంటే జాతిస్మృతిలో జీవించడమే చాలా చాలా గొప్ప!
.
వచేల్ లింజీ

November 10, 1879 – December 5, 1931

అమెరికను కవి

.

The Eagle that is Forgotten

(John P. Altgeld: Dec. 30, 1847–March 12, 1902.)

Sleep softly … eagle forgotten … under the stone.

Time has its way with you there, and the clay has its own.

“We have buried him now,” thought your foes, and in secret rejoiced.

They made a brave show of their mourning, their hatred unvoiced.

They had snarled at you, barked at you, foamed at you day after day;

Now you were ended. They praised you … and laid you away.

The others that mourned you in silence and terror and truth,

The widow bereft of her crust, and the boy without youth,

The mocked and the scorned and the wounded, the lame and the poor,

That should have remembered forever … remember no more.

Where are those lovers of yours, on what name do they call—

The lost, that in armies wept over your funeral pall?

They call on the names of a hundred high-valiant ones;

A hundred white eagles have risen, the sons of your sons.

The zeal in their wings is a zeal that your dreaming began,

The valor that wore out your soul in the service of man.

Sleep softly … eagle forgotten … under the stone.

Time has its way with you there and the clay has its own.

Sleep on, O brave-hearted, O wise man, that kindled the flame—

To live in mankind is far more than to live in a name;

To live in mankind, far, far more … than to live in a name.

.

Vachel Lindsay

November 10, 1879 – December 5, 1931

American Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/192.html

కానుక… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

ప్రియతమా, చూడు! నన్ను నీకు సమర్పించుకుంటున్నాను

నా మాటలు నీకు అందమైన అలంకరణ సామగ్రి

వాటిని నువ్వు నీ అల్మారాలలో అందంగా అలంకరించుకుంటావు.

వాటి ఆకారాలు చిత్రంగా, సమ్మోహనంగా ఉంటాయి

అవి ఎన్నో వన్నెల్లో, ఎన్నో జిలుగుల్లో,

ఆకర్షిస్తుంటాయి.

అంతే కాదు, వాటినుండి వెలువడే సుగంధం

గదిని అత్తరు, పన్నీటివాసనలతో నింపుతుంది.

నేను చివరి మాట చెప్పేసరికి

నువ్వు నా సర్వస్వాన్నీ పొంది ఉంటావు.

కానీ, నేనే… జీవించి ఉండను.

.

ఏమీ లోవెల్

February 9, 1874 – May 12, 1925

అమెరికను కవయిత్రి

.

Amy Lowell

A Gift

.

See! I give myself to you, Beloved!

My words are little jars

For you to take and put upon a shelf.

Their shapes are quaint and beautiful,

And they have many pleasant colors and lustres

To recommend them.

Also the scent from them fills the room

With sweetness of flowers and crushed grasses.

When I shall have given you the last one

You will have the whole of me,

But I shall be dead.

.

Amy Lowell

American

February 9, 1874 – May 12, 1925

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

“అమూర్తులు”… స్యూమస్ ఓ సలివాన్, ఐరిష్ కవి

మేము మరుగుపడ్డ చోట్లనుండి
ఒక రహస్యద్వారం గుండా
ఇక్కడ పచ్చగా విరిసినవైపుకి
వెన్నెల్లో బయటకి వస్తాము.

అక్కడ రాత్రంతా మేము
ఆటపాటల్లో మునిగిపోతాము
ఎంతగా గంతులేస్తామంటే
ఈ నేల ఎన్నడూ చూసి ఉండదు

ఆడుతూ గెంతుతూ
పదంలేని రాగాలు తీస్తుంటే
ఆ రాగం ఎంత కమ్మగా ఉంటుందంటే
పక్షులు కూడా చిన్నబోతాయి.

అక్కడ ఎందరో కన్నియలుంటారు
నశ్వరమైన శరీరం ధరించినవాళ్ళు
తమ లేత కన్నులనిండా
పుడమి గురించి ఆశలు నింపుకున్నవాళ్ళు

ఈ అడవి సొగసుకి ఉబికిన సంగీతం ఎంత విశృంఖలంగా
చెవులు కన్నాలు పడేలా ఉంటుందంటే
వసంత ఋతుకాంత చెవుల్లో తమ శక్తిమేరకి
అద్భుతంగా పాడే కోకిలలు సైతం మౌనం దాలుస్తాయి.

అందులో తన్మయులైన అనేకమంది యువత
కలలో నడిచినట్టు నెమ్మదిగా నడుస్తారు.
ఇంద్రజాలాన్ని పోలిన ఆ స్వర సమ్మేళనానికి
కాళ్ళు నేలమీద నిలవక నృత్యం చేస్తారు.
.
ఓహ్! ఒకటేమిటి, అవ్యక్తమధురంగా
ఆలపించే పక్షులూ పిట్టలూ నేల వాలి
అంత మధురంగా తాము పాడలేమే అని
మౌనంగా లోలోన చింతిస్తూ ఉంటాయి.

అలా రాత్రల్లా గడిచిపోతుంది
మేము వెర్రి ఆనందం పొందుతాం.
మేము ఈ నేల ఎన్నడూ ఎరగని
హద్దులులేని నృత్యాలు చేస్తాము.
.
స్యూమస్ ఓ సల్లివాన్

17 July 1879 – 24 March 1958

ఐరిష్ కవి

.

.

The Others

.

From our hidden places,         

  By a secret path,

We come in the moonlight      

  To the side of the green rath.

There the night through

  We take our pleasure, 

Dancing to such a measure     

  As earth never knew.  

To dance and lilt 

  And song without a name,   

So sweetly chanted       

  ’Twould put a bird to shame.        

And many a maiden      

  Is there, of mortal birth,       

Her young eyes laden      

  With dreams of earth. 

Music so piercing wild  

  And forest-sweet would bring        

Silence on blackbirds singing 

  Their best in the ear of spring.       

And many a youth entrancèd 

  Moves slow in the dreamy round,  

His brave lost feet enchanted  

  With the rhythm of faery sound.    

Oh, many a thrush and blackbird    

  Would fall to the dewy ground,     

And pine away in silence        

  For envy of such a sound.    

So the night through,    

  In our sad pleasure,    

We dance to many a measure 

  That earth never knew.

.

Seumas O’Sullivan

17 July 1879 – 24 March 1958

Irish Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/276.html

.

జీవితమా! నే నేవర్ని?… జాన్ మేస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి

జీవితమా! నే నేవర్ని? అవిశ్రాంతంగా తిరిగే

జీవకణాలు పదిలంగా పొదువుకున్న నీటి తిత్తినా?

అ వెందుకు పనిచేస్తున్నాయో వాటికే తెలియదు, ఒక క్షణం ఆగవు,

వాటి యజమాని ఎక్కడ ఉన్నాడో నాకు అంతుపట్టదు

వాటిని పనిచెయ్యమని అడగను, అయినా అవి కష్టపడి పనిచేస్తాయి,

అవొక ప్రపంచాన్ని అల్లుతాయి ఒకరినొకరు వాడుకునేలా;

ఏ లక్ష్యం సాధించడానికో నాకు తెలీదు, ఎప్పుడు మొదలో తెలీదు

ఎవర్ని పొగడాలో, ఎవర్ని తెగడాలో, ఎవర్ని ముద్దుచెయ్యాలో తెలియదు.

ఒక అద్భుతంలో మరొక అద్భుతం పొదిగినట్టు,

నే నీ విశ్వానికి సమాధానం చెబుతుంటాను, కెరటం తర్వాత కెరటంలా

నా మీంచి, తడిదో. పొడిదో, నీటిపుట్టంత గాలి పుట్ట తరలిపోతుంది,

గగనబిలంలోంచి ఈదుకుంటూ నిండు జాబిలి లేస్తుంది

లేదా అద్భుతమైన రవిబింబం ఉదయిస్తుంది;

కోటానుకోట్ల ఈ “నేను” లు పులకరిస్తాయి

ఎందుకో తెలీదు, అయినా ఆశ్చర్యం పడక మానవు.

.

జాన్ మేస్ ఫీల్డ్

1 June 1878 – 12 May 1967

ఇంగ్లీషు కవి

.

What am I, Life?

.

What am I, Life? A thing of watery halt

Held in cohesion by unresting cells,

Which work they know not why, which never halt,

Myself unwitting where their Master dwells

I do not bid them, yet they toil, they spin

A world which uses me as I use them;

Nor do I know which end or which begin

Nor which to praise, which pamper, which condemn.

So, like a marvel in a marvel set,

I answer to the vast, as wave by wave

The sea of air goes over, dry or wet,

Or the full moon comes swimming from her cave,

Or the great sun comes forth: this myriad I

Tingles, not knowing how, yet wondering why.

.

John Masefield

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/214.html

మాక్స్ మైకేల్సన్, అమెరికను కవి

ఓ తుఫానా!
నన్ను నీ చక్రవ్యూహాల్లోకి తీసుకుపో
తలతిరిగేలా నీతో దొర్లనీ
తుపాకి గుండులా నీతోపాటు దుముకుతూ ఎగరనీ.
నేను నిన్ను “ఆగు. చాలు” అనాలి
నీవన్నీ బెదిరింపులని తెలుసు;
నువ్వు విశృంఖలంగా ఉంటావనీ తెలుసు;
నువ్వు చెప్పాపెట్టకుండా వస్తావనీ తెలుసు!
.
మేక్స్

1880-1953

అమెరికను కవి

Storm

.

Storm,

Wild one,

Take me in your whirl,

In your giddy reel,

In your shot-like leaps and flights.

Hear me call—stop and hear.

I know you, blusterer; I know you, wild one—

I know your mysterious call.

.

Max Michelson

1880-1953

American Imagist Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/240.html

అడవి పాట… హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి

నా తల వాల్చడానికి చోటు లేదు
నా గుండెలమీద ఏ శిశువూ పడుక్కోదు
నా కోసం ఏ పెళ్ళి విందూ ఇవ్వబడదు
నేనీ నింగి కింద ఒంటరిగా నడవాల్సిందే.

నా అధికారం డబ్బూ త్యజించాను
కొండంత ఎత్తు బరువు దించుకుని తేలికపడ్డాను!
పగలంతా ఈ రాళ్ళగుట్టలమీద నడిచి
చీకటివేళకి పొయ్యి వెలిగించుకుంటాను.

వడగళ్ళకి కొండంతా విరగబూస్తుంది
శీతగాలి నా కన్నీరు తుడుస్తుంది
నేను బలహీనను, అయినా, మృగశిర నాభయాలు
పోగొట్టినపుడు, నేను బలం పుంజుకుంటాను.

వేకువ దుప్పటి తొలగించి
గోరుగిల్లుచంద్రుడితో నిద్రలేస్తాను.
సమవర్తి తండ్రి సమదృష్టితో చూసి
నా చెయ్యిపట్టుకుని నడిపిస్తాడు .

పడమటిదిక్కున మంటల రెక్కలు వ్యపిస్తున్నాయి.
నాకు దొరుకుతుందా? అసలు నాకు తెలుస్తుందా?
నా కాళ్ళు అన్వేషణకి కంకణం కట్టుకున్నాయి—
రెండు అనంతాలు విడదీసే దిగంతరేఖ వైపుకి
.
హారియట్ మన్రో
23 December 1860- Sept 26 1936
అమెరికను కవయిత్రి

.

.

Mountain Song

.

I have not where to lay my head:
Upon my breast no child shall lie;
For me no marriage feast is spread:
I walk alone under the sky.

My staff and scrip I cast away—
Light-burdened to the mountain height!
Climbing the rocky steep by day,
Kindling my fire against the night.

The bitter hail shall flower the peak,
The icy wind shall dry my tears.
Strong shall I be, who am but weak,
When bright Orion spears my fears.

Under the horned moon I shall rise
Up-swinging on the scarf of dawn.
The sun, searching with level eyes,
Shall take my hand and lead me on.

Wide flaming pinions veil the West—
Ah, shall I find? and shall I know?
My feet are bound upon the Quest—
Over the Great Divide I go.
.
Harriet Monroe
December 23, 1860 – September 26, 1936
American poet and Editor 

http://www.bartleby.com/265/260.html

నేను ప్రపంచాన్ని పరిత్యజించాను… యోనిజీరో నొగూచి, జపనీస్ కవి

నేను ప్రపంచాన్ని పరిత్యజించేను
నన్నేదీ తాకదని అనుకున్నాను.
అయినా, మంచు కురిసిన రోజు చలేస్తూనే ఉంది
పూలు విరిసిన రోజు ఆనందం కలుగుతూనే ఉంది
.
యోనిజీరో నొగూచి
December 8, 1875 – July 13, 1947
జపనీస్ కవి.

.

I Have Cast the World

I have cast the world,    

      and think me as nothing.  

Yet I feel cold on snow-filling day,  

And happy on flower day.

.

Yone Noguchi 

December 8, 1875 – July 13, 1947 

Japanese Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/264.html

నా కృతజ్ఞతలు … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి

 నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఉండేవాడు
తర్వాత  నేను మామూలు  మనిషిని కాలేకపోయాను.
నన్ను అంతలా మార్చిన ఆ చెలిమికి కృతజ్ఞతలు.
అతని పేరు నేను చెప్పను.

అతనిప్పుడు నాకొక ప్రతీక
పువ్వులనాలన్నా, రువ్వలనాలన్నా.
సంగీతానికీ అతను ఒక ప్రతీక
భగ్నవీణ కీ అతనే.

అతన్ని ఒక పుస్తకంద్వారా తెలుసుకున్నాను
ఎన్నడూ చెయ్యీ చెయ్యీ కలిపింది లేదు.
అతనిప్పుడు లేడు…అతని కోసం
ఏ పచ్చని చేలల్లోనూ వెతకక్కరలేదు.

స్వర్గం ఉండకపోవచ్చు. నాకు నమ్మకం లేదు,
కానీ నాకో చిన్న కోరిక ఉంది…
నా కడపటి శ్వాస తర్వాత నా ఆత్మ
నన్ను కెరటంలా మీదకి ఎత్తి

చుక్కల్లోకి తీసుకుపోయి ప్రకటించాలి,
అతని స్నేహం స్వర్గ తుల్యం అని;
అతని జీవితాన్ని కమ్ముకున్న మేఘాలు తొలగి
ఇప్పటికైనా వెలుగు ప్రసరించాలని ప్రార్థించాలి.

అతను నా యవ్వనంలో ఎంతగా ప్రకాశించేవాడంటే
పరిగెత్తడం నేర్చుకుని ఆనందించానని చెప్పాలి!
అతన్ని ఒక చిట్ట చివరి కోరిక కోరాలి…
ఒక్క సారి తన గొంతు వినిపించమని.

నన్ను అమితంగా కదిలించిన వ్యక్తి ఉండేవాడు
నేను మునపటి మనిషిని కాలేకపోయాను;
నేనూ ప్రార్థిస్తాను, నేనూ ఎవరో ఒకరి హృదయాన్ని
చురుక్కు మనే మంటలా స్పృశించగలగాలని!

.

గ్రేస్ ఫాలో నార్టన్

(1876- 1962)

అమెరికను కవయిత్రి

.

I Give Thanks

There’s one I once loved so much

I am no more the same.

I give thanks for that transforming touch.

I tell you not his name.

He has become a sign to me

For flowers and for fire.

For song he is a sign to me

And for the broken lyre.

And I have known him in a book

And never touched his hand.

And he is dead- I need not look

For him through his green land.

Heaven may not be. I have no faith,

But this desire I have—

To take my soul on my last breath,

To lift it like a wave.

And surge unto the star and say,

His friendship had been heaven;

And pray, for clouds that closed his day

May light at last be given!

And say, he shone at noon so bright

I learned to run and rejoice!

And beg him for one last delight—

The true sound of his voice.

There’s one that once moved me so much

I am no more the same;

And I pray too, I too, may touch

Some heart with singing flame.

.

Grace Fallow Norton

(1876- 1962)

American Poetess

The New Poetry: An Anthology. 1917

Ed: Harriet Monroe (1860- 1936)

Poem Courtesy: http://www.bartleby.com/265/267.html

ఆకాశంలో పరుగులాడి… జేమ్స్ ఓపెన్ హీం, అమెరికను కవి

నక్షత్రాల పయ్యెద రెపరెపలాడుతూ…

సూర్యుడూ, భూమీ ఆమె హృదయ కుసుమం మీద

భ్రమరాల్లా తారాడుతూ…

గహన రోదసి కుహరాల్లో వీచే గాలులపై పాదాలు తేలియాడుతూ…

ఎవ్వరామె అలా ఆకాశంలో పరుగిడుతున్నది?

ఆమె కన్నులు నీహారికలవలె అస్పష్టముగా ఉన్నవి.

చీకటిలో దూరాననున్న తన ప్రియునకై ఆత్రపడుతున్నది కాబోలు.

.

జేమ్స్ ఓపెన్ హీం

1882–1932

అమెరికను కవి

Runner in the Skies

.

Who is the runner in the skies,

With her blowing scarf of stars,

And our earth and sun hovering like bees about her blossoming heart!

Her feet are on the winds where space is deep;

Her eyes are nebulous and veiled;

She hurries through the night to a far lover.

.

James Oppenheim

1882- 1932

American Poet

పునరుద్ధరణ… హొరేస్ హోలీ, అమెరికను కవి

మరొకసారి, సంతోషం నిండిన కవులనోటంట
మాటలు
పదునుగా వెలువడతాయి.
నవయువప్రేమికుడిలా
ఒక తెలియని శక్తి వాళ్ళని ఆవహించి,
చిన్నాభిన్నం చేస్తుంది…
దానితో వాళ్ళు భావగర్భితులౌతారు.
వాళ్ళ మాటలు ఇప్పుడు తుఫాను హోరులా ఉంటాయి;
వాటి భావాలు మనసులోకి సూటిగా దిగబడతాయి
నర్తకి తన జుబ్బాలోంచి తీసి ఝళిపించిన చురకత్తిలా.
మరొక సారి
కరుకైన, భీకరమైన పదాలు
అనంత నిశ్శబ్దపు లోతులలోంచి బయటకు వస్తాయి.
వాళ్ళ వెనక
నూత్న దైవాలూ, విజేతలైన జాతులూ
ఆనందంగా వంతపాడుకుంటూ నడుస్తాయి.
.
హొరేస్ హోలీ
అమెరికను కవి

.

Renaissance

Once more, in the mouths of glad poets,

Words have become

Terrible.

An energy has seized them and ravished them

Like a young lover,

And they are pregnant.

Their sound is the roaring of March tempests;

Their meaning stabs the heart

Like the dagger thrust flashing from a dancer’s sleeve.

Terrible and stark words

Once more,

Risen from the deeps of eternal silence.

New gods and fruitfuller races

Chant

Jubilant behind them!

.

Horace Holley

American Poet

Courtesy: https://archive.org/stream/divinationscreat00holl#page/2/mode/2up

%d bloggers like this: