దిక్కుల చివర లేత నీలిరంగు ఆకసపు వెలుగులో
బద్ధకంతో నెమ్మదిగా వెనక్కి మరలుతున్న
కెరటాల అంచున
ఓడల నీడలు తేలియాడుతున్నాయి.
ఆకసం వాలిన చోట పొడవాటి గోధుమరంగు గీత ఒకటి
జానెడు ఉప్పు కయ్యల్లో చేతులకొద్దీ ఇసుక మేటలు వేస్తోంది.
స్పష్టంగా కనిపించే ఆ అంతులేని ముడతలు,
భంగపడి,లోపలికి ముడుచుకుని, నిష్క్రమిస్తున్నాయి.
చిరుకెరటాలు ముక్కలై, సముద్రపు ఒడ్డును
పగులుతున్న తెల్లని నురగలతో కడుగుతున్నాయి.
కెరటాల అంచున
లేత నీలపు వెలుగులో
ఓడల నీడలు తేలియాడుతున్నాయి.
.
కార్ల్ సాండ్బర్గ్