అందంగా ఉన్న ముఖం గురించీ
ఎర్రని పెదాలూ, బుగ్గలగురించీ
ఆమె కురుల గురించీ గాని,
తీరుగా దిద్దిన ముంగురుల గురించిగాని
దేవదూతలా ఆలపించే అరుదైన
గంధర్వ గాత్రం గురించి గాని చెప్పొద్దు;
నాకు ఎంపిక చేసుకునే అవకాశం ఉండి ఉంటే
నేను ఇవన్నీ ఎంచుకుని ఉండేవాడిని.
కానీ, నువ్వు నేను ప్రేమించి తీరాలంటే
అందులోను అది ఆమె అయి ఉండాలంటే
నన్ను ఒప్పించడానికి ఒక్కటే షరతు
ఆమె నన్ను ప్రేమించాలి.
మీ ఆడవాళ్ళ సౌందర్యాలు
సౌందర్య సాధనాలకి ప్రతీకలు.
అవి ప్రతి సామాన్య వస్తువులాగే
ఎక్కడో చూసినట్టు ఉంటాయి.
గులాబులు వాళ్ళ పెదవులూ, బుగ్గలకంటే ఎరుపు
లిల్లీలముందు వాళ్ళ తెల్లదానం దిగదుడుపే.
వస్తువు అందుబాటులో ఉండగా
నీడకోసం అర్రులుచాచే మూర్ఖుడెవడు?
నువ్వు నేనొక అమ్మాయిని ప్రేమించక తప్పదంటే
ఆ అమ్మాయి ముందుగా దయాళువై ఊండాలి
లేని పక్షంలో నేను
గడియారానికి బానిసనైపోతాను.